భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌ ముగిసింది. ఇప్పుడు మరో క్రికెట్‌ సమరానికి రంగం సిద్ధమవుతోంది. దేశంలో IPL 2024 నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఐపీఎల్ 2024 సీజన్ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఐపీఎల్ 2024 మార్చి రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ఐపీఎల్-17 షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన రానుంది. అయితే ఇప్పటికే ఆటగాళ్ల రిలీజ్‌, రిటెన్షన్‌ ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో పది జట్లు అట్టిపెట్టుకున్న, వదులుకున్న, మార్చుకున్న ఆటగాళ్ల వివరాలను ప్రకటించాయి. జట్టుకు భారంగా మారిన వారిని వదులుకున్నాయి. తమదగ్గర మిగిలిన డబ్బుతో మినీ వేలానికి యాజమాన్యాలు రెడీ అయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారి సోషల్‌ మీడియాను దున్నేస్తోంది. ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి పాండ్యాను ముంబై దక్కించుకుందన్న వార్త క్రికెట్‌ ప్రపంచాన్ని అబ్బురపరిచింది. ఈ నేపథ్యంలో కోహ్లీ చేసిన పోస్ట్‌ వైరల్‌ అయింది. 



ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో  కోహ్లి ముఖంపై గాయాలతో.. తెల్లటి టీ-షర్ట్ ధరించి కనిపించాడు. ముఖంపై గాయాలతో కోహ్లీ పోస్ట్‌లో కనిపించాడు. ముక్కుపై ఉన్న గాయానికి బ్యాండ్‌ ఎయిడ్‌ వేసుకున్నాడు. ముఖంపై గాయాలు ఉన్నా చిరునవ్వు చిందిస్తూ ఉన్న ఫొటోను కోహ్లీ పోస్ట్‌ చేశాడు. మీరు అవతలి వ్యక్తిని కూడా చూడాలంటూ కోహ్లీ చేసిన పోస్ట్‌లో ఏదో గూడార్థం ఉందనిపిస్తోంది. ఐపీఎల్‌ ప్రాంఛైజీల రిటైన్‌, రిలీజ్‌ జాబితాలు ప్రకటించిన తర్వాత కోహ్లీ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఐపీఎల్‌ ఆరంభం నుంచి ఆర్‌సీబీకి తప్పితే మరే జట్టుకు ఆడని ఏకైక ప్లేయర్‌ కూడా కోహ్లీనే. అలాంటి విరాట్‌ కూడా ఒకప్పుడు ఆర్సీబీని వదిలేయాలనుకున్నాడు. గతేడాది ఐపీఎల్ సందర్భంగా విరాట్ చిట్‌చాట్‌.. పాండ్యా రిలీజ్‌ తర్వాత ఇప్పుడు వైరల్‌గా మారింది.



 తనను ఐపీఎల్‌ వేలంలోకి రావాలని కొన్ని ఫ్రాంచైజీలు కోరాయని.. తాను కూడా ఒక దశలో బెంగళూరును వదిలేద్దామని నిర్ణయించుకున్నానని కోహ్లీ అప్పుడు జరిగిన చిట్‌చాట్‌లో అన్నాడు. ఇది చెప్పడానికి తనకేమీ మొహమాటం లేదని... కానీ, ఒక రోజు జీవితమంటే ఏంటా అనే ఆలోచన వచ్చిందన్నాడు. మనకు తెలిసి ట్రోఫీలు గెలిచిన గొప్ప ఆటగాళ్లు చాలా మంది ఉన్నారని... కానీ, ఎవరూ మిమ్మల్ని ఇతను ఐపీఎల్‌ ఛాంపియన్‌ లేదా వరల్డ్‌ కప్‌ ఛాంపియన్‌’ అని పిలవరని కోహ్లీ ఆ చిట్‌చాట్‌లో చెప్పాడు. నువ్వు మంచి వ్యక్తివైతే.. ప్రజలూ నిన్ను ప్రేమిస్తారు. ఒకవేళ చెడ్డ వ్యక్తిఅయితే వారే దూరంగా పెడతారని.... జీవితంలో ఇదే అత్యంత విలువైందని అందుకే ఆర్సీబీని వీడలేదని కోహ్లీ అన్నాడు. అందుకే ఆర్‌సీబీ పట్ల విధేయతగా ఉండటానికి మరో కారణం కూడా ఉందన్న కోహ్లీ... ట్రోఫీని అందించకపోయినా.. ఏ ఫ్రాంచైజీ కూడా ఇలా ఆటగాడిపై నమ్మకం ఉంచి మద్దతుగా నిలిచిన దాఖలాలు లేవని.... ఒక్కసారి కూడా ట్రోఫీని గెలవకపోయినా తన పట్ల ఆర్‌సీబీ యాజమాన్యం విశ్వాసం మరిచిపోలేమని కోహ్లీ అన్నాడు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply