Mumbai Indians News In Telugu: భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌ ముగిసింది. ఇప్పుడు మరో క్రికెట్‌ సమరానికి రంగం సిద్ధమవుతోంది. దేశంలో IPL 2024 నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఐపీఎల్ 2024 సీజన్ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఐపీఎల్ 2024 (IPL 2024) మార్చి రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ఐపీఎల్-17 షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన రానుంది. అయితే ఇప్పటికే ఆటగాళ్ల రిలీజ్‌, రిటెన్షన్‌ ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో పది జట్లు అట్టిపెట్టుకున్న, వదులుకున్న, మార్చుకున్న ఆటగాళ్ల వివరాలను ప్రకటించాయి. జట్టుకు భారంగా మారిన వారిని వదులుకున్నాయి. తమదగ్గర మిగిలిన డబ్బుతో మినీ వేలానికి యాజమాన్యాలు రెడీ అయ్యాయి. అయితే ఈ రిటైన్‌ జాబితాలో హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) పేరు సంచలనం సృష్టించింది. హార్దిక్‌ పాండ్యా ముంబై జట్టులో చేరతాడన్న ఊహాగానాలే నిజమయ్యాయి. దీనిపై తొలిసారి అంబానీలు స్పందించారు.


హార్దిక్‌ పాండ్యా రాకతో జట్టు మరింత బలోపేతమైందని సంతోషం వ్యక్తం  చేశారు. హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై ఇండియన్స్‌లో చేరడంపై ప్రాంఛైజీ యజమాని నీతా అంబానీ ప్రత్యేకంగా స్పందించారు. హార్దిక్ సొంత ఇంటికి తిరిగి వచ్చినందుకు తాము సంతోషిస్తున్నామని నీతా అన్నారు. ఇది తమ ముంబై ఇండియన్స్ కుటుంబంతో పాండ్యా హృదయపూర్వక పునఃకలయికగా నీతా అభివర్ణించారు. ముంబై ఇండియన్స్ నుంచి ఎదిగిన పాండ్యా ఇప్పుడు టీమ్ ఇండియా స్టార్‌గా మారాడని గుర్తు చేసుకున్నారు. పాండ్యా చేరికతో తమ జట్టు మరింత దుర్భేద్యంగా మారిందని నీతా అన్నారు. హార్దిక్ తిరిగి రావడంపై ముంబై ఇండియన్స్ సహ యజమాని ఆకాష్ అంబానీ కూడా స్పందించారు. హార్దిక్‌ని తిరిగి ముంబై ఇండియన్స్‌లో చూడడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏ జట్టుకైనా పాండ్యా గొప్ప సమతూకాన్ని అందిస్తాడని ఆకాష్‌ అంబానీ పొగడ్తల వర్షం కురిపించాడు. 



 టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తిరిగి ముంబయి ఇండియన్స్‌ గూటికే చేరాడు. గత రెండు సీజన్లలో కెప్టెన్‌గా గుజరాత్‌ టైటాన్స్‌ను ఫైనల్స్‌ చేర్చడమే కాక, 2022లో విజేతగా కూడా నిలిపిన పాండ్యా.. వచ్చే సీజన్‌ నుంచి తిరిగి ముంబయికి ఆడబోతున్నాడు. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య పాండ్యా  ముంబయి జట్టు సొంతమయ్యాడు. ముంబైలో చేరేందుకు గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ బాధ్యతల నుంచి హార్దిక్‌ పాండ్యా వైదొలిగాడు. IPL చరిత్రలోనే అతిపెద్ద ట్రేడింగ్‌ జరిగి హార్దిక్‌ పాండ్యా ముంబై జట్టు సొంతమయ్యాడు. . హార్దిక్‌ పాండ్యాను తిరిగి జట్టులోకి తీసుకునేందుకు వేగంగా పావులు కలిపిన ముంబై అనుకున్నది సాధించింది. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను పరస్పరం మార్చుకునే సమయం ఇక ముగిసిందనుకున్న సమయంలో ఈ సంచలనం జరిగింది. ఆల్ క్యాష్ ట్రేడ్‌లో భాగంగా హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ను వదిలి ముంబైతో చేరినట్లు క్రిక్ బజ్ తెలిపింది. ఒప్పందం మీద రెండు ఫ్రాంచైజీలు సంతకాలు కూడా చేసినట్లు పేర్కొంది. 2015 నుంచి 2021 మధ్య జరిగినIPLలో ముంబై ఇండియన్స్‌ నాలుగుసార్లు గెలవడంతో పాండ్యా కీలక కీలక పాత్ర పోషించాడు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply