భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌ ముగిసింది. ఇప్పుడు మరో క్రికెట్‌ సమరానికి రంగం సిద్ధమవుతోంది. దేశంలో IPL 2024 నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఐపీఎల్ 2024 సీజన్ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఐపీఎల్ 2024 మార్చి రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ఐపీఎల్-17 షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన రానుంది. అయితే ఇప్పటికే ఆటగాళ్ల రిలీజ్‌, రిటెన్షన్‌ ప్రక్రియ పూర్తయింది. దీని తర్వాత ఫ్రాంచైజీల పరిస్థితి ఎలా ఉందంటే...


ముంబై ఇండియన్స్‌:  ముంబై ఇండియన్స్‌  వద్ద ఇప్పుడు మొత్తం 17 మంది  ఆటగాళ్లు ఉన్నారు. అందులో  12 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటివరకూ రూ. 84.75 కోట్లను ముంబై ఇండియన్స్‌ ఖర్చు పెట్టింది. పర్స్‌లో మరో 15.25 కోట్లు మిగిలింది. ముంబై ఇంకా 8 ఆటగాళ్లను తీసుకోవచ్చు. ఇందులో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు  ఉండొచ్చు.


గుజరాత్‌ టైటాన్స్‌: గుజరాత్‌ టైటాన్స్‌  వద్ద ఇప్పుడు మొత్తం 18 మంది  ఆటగాళ్లు ఉన్నారు. 12 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటివరకూ రూ. 76.85  కోట్లను గుజరాత్‌ టైటాన్స్‌ ఖర్చు పెట్టింది.  పర్స్‌లో మరో 23.15 కోట్లు మిగిలింది. గుజరాత్‌ టైటాన్స్‌ ఇంకా 7 ఆటగాళ్లను తీసుకోవచ్చు. ఇందులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు  ఉండొచ్చు.
 


చెన్నై సూపర్‌ కింగ్స్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌  వద్ద ఇప్పుడు మొత్తం 19 మంది  ఆటగాళ్లు ఉన్నారు. 14 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటివరకూ రూ. 68.06 కోట్లను చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఖర్చు పెట్టింది.  పర్స్‌లో మరో 31.04 కోట్లు మిగిలింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌  ఇంకా 6 ఆటగాళ్లను తీసుకోవచ్చు. ఇందులో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు  ఉండొచ్చు.


ఢిల్లీ క్యాపిటల్స్‌: ఢిల్లీ క్యాపిటల్స్‌  వద్ద ఇప్పుడు మొత్తం 16 మంది  ఆటగాళ్లు ఉన్నారు. 12 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటివరకూ రూ. 71.05 కోట్లను ఢిల్లీ క్యాపిటల్స్‌ ఖర్చు పెట్టింది.  పర్స్‌లో మరో 28.95 కోట్లు మిగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌  ఇంకా 9 ఆటగాళ్లను తీసుకోవచ్చు. ఇందులో నలుగురు విదేశీ ఆటగాళ్లు  ఉండొచ్చు.


కోల్‌కతా నైట్‌రైడర్స్‌: కోల్‌కతా నైట్‌రైడర్స్‌  వద్ద ఇప్పుడు మొత్తం 13 మంది  ఆటగాళ్లు ఉన్నారు. 9 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటివరకూ రూ. 67.03  కోట్లను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఖర్చు పెట్టింది.  పర్స్‌లో మరో 32.07 కోట్లు మిగిలింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇంకా12 ఆటగాళ్లను తీసుకోవచ్చు. ఇందులో నలుగురు విదేశీ ఆటగాళ్లు  ఉండొచ్చు.


లక్నో సూపర్‌ జెయింట్స్‌: లక్నో సూపర్‌ జెయింట్స్‌  వద్ద ఇప్పుడు మొత్తం 19 మంది  ఆటగాళ్లు ఉన్నారు. 13 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటివరకూ రూ. 86.85 కోట్లను లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఖర్చు పెట్టింది.  పర్స్‌లో మరో13.15 కోట్లు మిగిలింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇంకా 6 ఆటగాళ్లను తీసుకోవచ్చు. ఇందులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు  ఉండొచ్చు.


పంజాబ్‌ కింగ్స్‌: పంజాబ్‌ కింగ్స్‌  వద్ద ఇప్పుడు మొత్తం 17 మంది  ఆటగాళ్లు ఉన్నారు. 11 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటివరకూ రూ. 70.09  కోట్లను పంజాబ్‌ కింగ్స్‌ ఖర్చు పెట్టింది.  పర్స్‌లో మరో29.01 కోట్లు మిగిలింది. పంజాబ్‌ కింగ్స్‌ ఇంకా 8 ఆటగాళ్లను తీసుకోవచ్చు. ఇందులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు  ఉండొచ్చు.


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు  వద్ద ఇప్పుడు మొత్తం 18 మంది  ఆటగాళ్లు ఉన్నారు. 14 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటివరకూ రూ. 59.25 కోట్లను  ఖర్చు పెట్టింది.  పర్స్‌లో మరో40.75 కోట్లు మిగిలింది. ఇంకా 7 మంది ఆటగాళ్లను తీసుకోవచ్చు. ఇందులో నలుగురు విదేశీ ఆటగాళ్లు  ఉండొచ్చు.


రాజస్థాన్‌ రాయల్స్‌: రాజస్థాన్‌ రాయల్స్‌  వద్ద ఇప్పుడు మొత్తం 17 మంది  ఆటగాళ్లు ఉన్నారు. 12 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటివరకూ రూ. 85.5 కోట్లను  ఖర్చు పెట్టింది.  పర్స్‌లో మరో14.5 కోట్లు మిగిలింది. ఇంకా 8 మంది ఆటగాళ్లను తీసుకోవచ్చు. ఇందులో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు  ఉండొచ్చు.


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌  వద్ద ఇప్పుడు మొత్తం 19 మంది  ఆటగాళ్లు ఉన్నారు. 14 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటివరకూ రూ. 66 కోట్లను  ఖర్చు పెట్టింది.  పర్స్‌లో మరో34 కోట్లు మిగిలింది. ఇంకా 6 మంది ఆటగాళ్లను తీసుకోవచ్చు. ఇందులో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు  ఉండొచ్చు.