స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌ (World Cup) ముగిసిందో లేదో దేశంలో ఐపీఎల్‌(IPL) సందడి మొదలైంది. వచ్చే నెల 19న ఐపీఎల్‌ మినీ వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో పది జట్లు అట్టిపెట్టుకున్న, వదులుకున్న, మార్చుకున్న ఆటగాళ్లను ప్రకటించేందుకు ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు  అన్ని జట్లు తమ జట్ల వివరాలను ప్రకటించాయి. జట్టుకు భారంగా మారిన వారిని వదులుకున్నాయి. తమదగ్గర మిగిలిన డబ్బుతో మినీ వేలానికి యాజమాన్యాలు రెడీ అయ్యాయి. ఐపీఎల్‌ చరిత్రలోనే అతిపెద్ద ట్రేడింగ్‌ జరిగి హార్దిక్‌ పాండ్యా మళ్లీ ముంబై గూటికి చేరాడు. బౌలింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పూర్తి ప్రక్షాళనకు దిగింది. అలాగే మరికొన్ని జట్లు బ్యాటింగ్‌పై దృష్టి సారించి కొందరు ఆటగాళ్లను వదులుకున్నాయి.


ముంబయి ఆర్చర్‌, మెరెడిత్‌, రిచర్డ్‌సన్‌, జోర్డాన్‌ వంటి ఆటగాళ్లను వదులుకుంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు హసరంగ, హర్షల్‌ పటేల్‌, హేజిల్‌వుడ్‌, విల్లీ, పార్నెల్‌ లాంటి బౌలర్లను వదులుకుంది. పని భారం కారణంతో వచ్చే సీజన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న స్టార్‌ ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌ సహా అంబటి రాయుడు,, ప్రిటోరియస్‌, జేమీసన్‌ ఆటగాళ్లను చెన్నై విడుదల చేసింది. గత సీజన్‌లో విఫలమైనప్పటికీ పృథ్వీ షాపై ఢిల్లీ క్యాపిటల్స్‌ నమ్మకముంచింది. రూట్‌, హోల్డర్‌ను రాజస్థాన్‌ విడిచిపెట్టింది. రూ.9 కోట్లతో సొంతం చేసుకున్న ఫినిషర్‌ షారుక్‌ ఖాన్‌ను పంజాబ్‌ వదులుకుంది. కోల్‌కతా కూడా బౌలింగ్‌ విభాగంపై దృష్టి పెట్టి శార్దూల్‌, ఫెర్గూసన్‌, సౌథీ, ఉమేశ్‌ యాదవ్‌, షకిబుల్‌ హసన్‌ ఆటగాళ్లను వద్దనుకుంది. 


ప్రాంచైజీలు వదిలేసిన ఆటగాళ్లు


గుజరాత్‌ టైటాన్స్‌  ఎనిమిదిమంది ఆటగాళ్లను వదలుకుంది. అందులో కేఎస్ భరత్, శివమ్ మావి, యశ్ దయాల్, ప్రదీప్ సంగ్వాన్, ఓడెన్ స్మిత్, దసున్ శనక, అల్జారీ జోసెఫ్, ఉర్విల్ పటేల్ ఉన్నారు.


చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎనిమిది మంది ఆటగాళ్లను వదులుకుంది. బెన్ స్టోక్స్, డ్వేన్ ప్రిటోరియస్, ఆకాష్ సింగ్, జేమీసన్, భగత్ వర్మ, సేనాపతి, సిసింద మగల, అంబటి రాయుడు(రిటైర్) లను చెన్నై వదులుకుంది.


ముంబయి ఇండియన్స్‌ పదకొండు మందిని వదులుకుంది. జోఫ్రా ఆర్చర్, స్టబ్స్, డ్యూన్ జాన్‌సెన్, మహ్మద్ అర్షద్ ఖాన్, హృతిక్ షోకీన్, సందీప్ వారియర్, క్రిస్ జోర్డాన్, రిలేమెరిడిత్, రిచర్డ్ సన్, రాఘవ గోయల్, రమణ్ దీప్ సింగ్‌లను రిలీజ్‌ చేసింది. 


కోల్‌కతా నైట్‌రైడర్స్‌ .. ఎక్కువమంది ఆటగాళ్లను రిలీజ్‌ చేసిన జట్టు కోల్‌కత్తా నైట్‌రైడర్సే. 
శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌథీ, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్, ఆర్యదేశాయ్, నారాయణ్ జగదీశన్, డేవిడ్ వీస్, మన్ దీప్ సింగ్, కుల్వంత ఖజ్రోలియా, జాన్సన్ ఛార్లెస్‌లను వదులుకుంది.


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు.. ఆర్సీబీ 11 మందిని వదులుకుంది. హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, ఫిన్ అలెన్, వనిందు హసరంగ, వేన్ పార్నెల్, బ్రేస్ వెల్, డేవిడ్ విల్లే, సోనూ యాదవ్, సిద్ధార్త్ కౌల్, కేదార్ జాదవ్, అవినాష్ సింగ్‌లను రిలీజ్‌ చేసింది.


ఢిల్లీ క్యాపిటల్స్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ కూడా 11 మంది ఆటగాళ్లను వదులుకుంది. మనీశ్ పాండే, సర్ఫరాజ్ ఖాన్, ముస్తాఫిజర్ రెహ్మాన్, చేతన్ సకారియా, రోవ్ మన్ పావెల్, కమలేశ్ నాగర్ కోటి, రిపల్ పటేల్, అమన్ ఖాన్, ప్రియమ్ గార్గ్ లను రిలీజ్‌ చేసింది.య


రాజస్థాన్‌ రాయల్స్  ఆర్‌ఆర్‌ 9 మందిని వదులుకుంది. జో రూట్, జేసన్ హోల్డర్, కుల్దిప్‌ యాదవ్, అబ్దుల్ బసిత్, ఆకాశ్ వశిస్ఠ్‌, మురుగన్ అశ్విన్‌, ఒబెద్ మెక్‌కాయ్‌, కేసీ కరియప్ప, కేఎం అసిఫ్‌లను వదిలేసింది. 


లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌  ఎనిమిది మంది ఆటగాళ్లను రిలీజ్‌ చేసింది. జయ్‌దేవ్ ఉనద్కత్, కరుణ్‌ నాయర్‌, డేనియల్ సామ్స్, మనన్‌ వోహ్రా,కరణ్ శర్మ, స్వప్పిల్ సింగ్‌, అర్పిత్ గులేరియా, సూర్యాన్ష్‌ షేడ్జేలను విడుదల చేసింది.


సన్‌‌రైజర్స్ హైదరాబాద్ ఆరుగురు ఆటగాళ్లను రిలీజ్‌ చేసింది. అందులో కార్తీక్ త్యాగి, అకీల్ హోసేన్, అదిల్ రషీద్, వివ్రాంత్ శర్మ, సమర్త్ వ్యాస్, హ్యారీ బ్రూక్ ఉన్నారు.


పంజాబ్ కింగ్స్‌.. అయిదుగురు ఆటగాళ్లను రిలీజ్‌ చేసింది. భానుక రాజపక్స, షారుఖ్‌ ఖాన్‌, మోహిత్ రాథీ , బాల్తేజ్‌ ధందా, అగద్‌ బవా, షారూఖ్‌ ఖాన్‌ను విడుదల చేయడం సంచలనం సృష్టించింది.