Virat Kohli’s New Phone: ఆస్ట్రేలియాతో ఫిబ్రవరి 4 నుంచి బోర్డర్- గావస్కర్ సిరీస్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం భారత్ దీనికోసం సిద్ధమవుతోంది. ఇరు జట్లు ప్రాక్టీసులో చెమటోడ్చుతున్నాయి. ఇదిలా ఉంటే ఈరోజు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
అంతకన్నా బాధ ఇంకొకటి ఉండదు
విరాట్ కోహ్లీ తన ఫోన్ పొగొట్టుకున్నాడన్న సమాచారం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. దీనికి సంబంధించిన విషయాన్ని కోహ్లీనే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులకు తెలియజేశాడు. 'అన్ బాక్స్ చేయడానికి ముందే మీ ఫోన్ దొంగతనానికి గురైతే.. మీకు అంతకంటే పెద్ద బాధ మరొకటి ఉండదు.' అని విరాట్ పోస్ట్ చేశాడు. దీనిపై ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది దీన్ని ప్రమోషనల్ ట్వీట్ గా చెప్తున్నారు. మరికొంతమంది తన సానుభూతిని తెలియజేస్తున్నారు.
ఆసీస్ తో టెస్ట్ సిరీస్ కు సిద్ధం
ఇక క్రికెట్ విషయానికొస్తే ఆస్ట్రేలియా మీద మంచి రికార్డు ఉన్న కోహ్లీ దాన్ని కొనసాగించాలని టీమిండియా కోరుకుంటోంది. కోహ్లీ కూడా నెట్స్ లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. 2019 నుంచి విరాట్ ఈ ఫార్మాట్ లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. అయితే ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్ లో కోహ్లీ మంచి ఫాంలో ఉన్నాడు. టెస్టుల్లోనూ అదే కొనసాగించాలని అందరూ కోరుకుంటున్నారు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న నాలుగు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో అందరి దృష్టి భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పైనే ఉంది. ఈ టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ మైదానంలో జరగనుంది. ఈ మైదానంలో విరాట్ కోహ్లి రికార్డును మామూలుగా లేదు. కోహ్లి ఇక్కడ మూడు మ్యాచ్‌ల్లో 88.50 సగటుతో 354 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని బ్యాట్ నుండి రెండు సెంచరీ ఇన్నింగ్స్‌లు కూడా వచ్చాయి. అందులో కోహ్లీ ఒక ఇన్నింగ్స్‌లో 213 పరుగులు కూడా చేశాడు.
2023 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ మధ్య నాగ్‌పూర్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ఫిబ్రవరి 21వ తేదీ మధ్య ఢిల్లీలో రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇక మూడో టెస్టు మార్చి ఒకటో తేదీ నుంచి మార్చి 5వ తేదీ దాకా ధర్మశాలలో జరగనుంది. మార్చి 9వ తేదీ నుంచి 13వ తేదీ దాకా అహ్మదాబాద్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది.