Aaron Finch Retirement:  కెప్టెన్ గా ఆస్ట్రేలియాకు తొలి టీ20 ప్రపంచకప్ ను అందించిన ఆటగాడు ఆరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మంగళవారం ఉదయం ఎంసీజీ మైదానంలో ఈ విషయాన్ని వెల్లడించాడు. దీనిపై ఒక ప్రకటన కూడా విడుదల చేశాడు. 


ఆరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్ లో తన కెరీర్ ను ముగించాడు. టీ20 కెప్టెన్ గా ఫించ్ ఆసీస్ కు తొలి ట్రోఫీని అందించాడు. నేను 2024 టీ20 ప్రపంచకప్ లో ఆడలేనని తెలుసు. అలాంటి పరిస్థితుల్లో రిటైర్ కావడానికి ఇదే సరైన సమయమని భావించాను. తద్వారా జట్టుకు భవిష్యత్ నాయకుడిని తయారుచేసుకోవడానికి సమయం లభిస్తుంది. నాకు ఎల్లవేళలా మద్దతుగా నిలిచినందుకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు, సహచరులకు, సహాయ సిబ్బందికి, నా కుటుంబానికి కృతజ్ఞతలు. అలాగే అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. 2020లో టీ20 ప్రపంచకప్, 2015 వన్డే ప్రపంచకప్ గెలవడం నా కెరీర్ లో అద్భుతమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అని ఫించ్ తన రిటైర్మెంట్ ప్రకటనలో తెలిపాడు. 


ఫించ్ అంతర్జాతీయ కెరీర్


ఓపెనర్ గా బరిలోకి దిగే ఆరోన్ ఫించ్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు. మొత్తం 146 వన్డేల్లో 5406 పరుగులు చేశాడు. అందులో 17 సెంచరీలు, 30 అర్ధసెంచరీలు ఉన్నాయి. 103 టీ20లు ఆడి 2 సెంచరీలు, 19 అర్ధసెంచరీలు సహా 3120 పరుగులు సాధించాడు. 5 టెస్ట్ మ్యాచుల్లో 278 పరుగులు చేశాడు. తన కెప్టెన్సీలో టీ20ల్లో జట్టుకు ప్రపంచకప్ ను అందించాడు. 2015 వన్డే వరల్డ్ కప్ గెలవడంలో ఫించ్ కీలకపాత్ర పోషించాడు. 


టీ20ల్లో ఓ ఇన్నింగ్స్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ఫించ్ పేరు మీదే ఉంది. 2018లో జింబాబ్వేపై ఓ మ్యాచ్ లో 172 రన్స్ స్కోర్ చేశాడు.






ఫైనల్ చేరాలంటే అదరగొట్టాల్సిందే


మరో నాలుగు రోజుల్లో ఇండియా ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్ఠాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలు కాబోతోంది. నాలుగు టెస్టుల ఈ సిరీస్ కోసం ఇప్పటికే అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గత రెండుసార్లూ ఓడిపోయిన ఆసీస్... ఈసారి ఎలాగైనా ఇండియాను దెబ్బతీయాలని చూస్తోంది. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ను దృష్టిలో పెట్టుకుంటే... ఈ సిరీస్ ఆస్ట్రేలియా కన్నా మనకే చాలా ముఖ్యం. ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ లో మనం అదరగొట్టాల్సిందే.


రీసెంట్ గా బంగ్లాదేశ్ పై సిరీస్ విజయం తర్వాత 58.93 పాయింట్ల శాతంతో ప్రస్తుతం టీమిండియా రెండో స్థానంలో ఉంది. వేరే ఫలితాలతో సంబంధం లేకుండా ఫైనల్ కు చేరాలంటే ఆస్ట్రేలియాపై 4-0 లేదా 3-1 తేడాతో ఇండియా గెలవాలి. అలా చేస్తే అయితే 68.06 పాయింట్ల శాతానికి లేదా 62.5 పాయింట్ల శాతానికి ఇండియా చేరుకుంటుంది. ఒకవేళ టీమిండియా సిరీస్ ను 2-2 తో సమం చేసుకుని, శ్రీలంక న్యూజిలాండ్ పై 2-0తో గెలిస్తే మాత్రం ఇండియా ఫైనల్ కు వెళ్లదు.ఒకవేళ 4-0, 3-1తో కాకుండా వేరే మార్జిన్ తో కనుక ఇండియా సిరీస్ గెలిస్తే మాత్రం... శ్రీలంక-న్యూజిలాండ్ సిరీస్ లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా డ్రా అయితేనే మనం ఫైనల్స్ కు వెళ్లగలం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో తెలుసుగా.... విజయానికి 12 పాయింట్లు, టై కు 6 పాయింట్లు, డ్రాకు 4 పాయింట్లు వస్తాయి. సో ఆస్ట్రేలియాతో సిరీస్ లో ఏదైనా మ్యాచ్ డ్రా అయినా సరే టీమిండియాకు పాయింట్లు వస్తాయి. పాయింట్ల శాతం మెరుగయ్యే ఛాన్స్ ఉంది. జస్ట్ ఓడకూడదు అంతే.