Virat Anushka: ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ముందు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి రిషికేశ్ పర్యటనకు వెళ్లాడు. ఈ జంట అక్కడ స్వామి దయానంద్ గిరి ఆశ్రమాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. అక్కడ నిర్వహించిన మతపరమైన ఆచారాలలో పాల్గొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
విరాట్ కోహ్లీ తనకు సమయం దొరికినప్పుడల్లా ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తుంటాడు. ఇటీవలే ఈ జంట వారి కుమార్తె వామికతో కలిసి బృందావన్ లోని ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ కరోలీ ఆశ్రమంలో కోహ్లీ, అనుష్కలు గంటపాటు గడిపారు. అనంతరం కుటియా (గుడిసె)లో ధ్యానం చేసి అక్కడ ఉన్న బాబా సమాధిని దర్శించారు. అక్కడి ఆచారం ప్రకారం ఆశ్రమంలో దుప్పట్లను విరాళంగా ఇచ్చారు. ఇప్పుడు రిషికేశ్ ను దర్శించుకున్నారు.
ఇటీవల శ్రీలంక, న్యూజిలాండ్ లతో జరిగిన వన్డే సిరీస్ లో పాల్గొన్నాడు. ప్రస్తుతం బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ ట్రోఫీ భారత్ కు ఎంతో కీలకం. ఈ సిరీస్ ను గెలుచుకుంటే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకునే అవకాశం ఉంటుంది. జూన్ లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ కు టీమిండియా చేరుకోవాలంటే ఆస్ట్రేలియాను 2-0 లేదా 3-1తో ఓడించారు. ఈ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ ఫిబ్రవరి 9న నాగ్ పూర్ వేదికగా ప్రారంభం కానుంది.
ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, జైదేవ్ ఉనద్కత్, ఉమేష్ యాదవ్.
ఆస్ట్రేలియా జట్టు
ఉస్మాన్ ఖవాజా, మాట్ రెన్ షా, స్టీవెన్ స్మిత్, డేవిడ్ వార్నర్, ట్రావెస్ హెడ్, మాగ్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, ఆస్టన్ అగర్, అలెక్స్ క్యారీ, పీటర్ హ్యాండ్స్ కూంబ్, పాట్ కమిన్, స్కాట్ బోలాండ్, జోష్ హేజిల్ వుడ్, నాథన్ లియాన్, లాన్స్ మోరిస్, టాడ్ ముర్ఫీ, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వీప్సన్.
భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌పై ప్రపంచం ఎందుకు దృష్టి సారిస్తోంది?
ఈ టెస్ట్ సిరీస్ ఫలితమే ఈ సంవత్సరం జరగబోయే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2021-23 ఫైనల్‌కు మార్గం ఏర్పడుతుంది. ఈ రెండు జట్లలో ఒకటి లేదా రెండు జట్లూ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందరి చూపు ఈ సిరీస్‌పైనే ఉంది. ప్రస్తుతం ఉన్న సమీకరణాల పరంగా చూసుకుంటే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ భారత్, ఆస్ట్రేలియాల మధ్య మాత్రమే జరగనుంది.
ఒకవేళ భారత జట్టు ఈ టెస్టు సిరీస్‌ను 2-0, 3-0, 4-0 లేదా 3-1 తేడాతో కైవసం చేసుకుంటే, టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాను దాటేసి నంబర్-1 అవుతుంది. యాషెస్ తర్వాత టెస్ట్ క్రికెట్‌లో భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. టెస్టు క్రికెట్‌లో ఈ రెండు జట్లు ఎప్పుడైతే ముఖాముఖి తలపడుతున్నాయో.. అప్పుడు క్రికెట్ ప్రపంచం దృష్టి ఈ సిరీస్‌పైనే ఉంటుంది.