Team India Battar Suryakumar Yadav:  సూర్యకుమార్ యాదవ్.. భారత టీ20 క్రికెట్ లో ఇప్పుడొక సంచలనం. జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసి ఏడాదే అవుతున్నా తన మార్క్ ఆటతో పేరు సంపాదించుకున్నాడు. టీ20ల్లో విధ్వంసకర ఆటతో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. విభిన్న షాట్లు ఆడుతూ టీమిండియా డివిలియర్స్ గా పేరు తెచ్చుకున్నాడు. 2022లో ఇప్పటివరకు 31 టీ20 మ్యాచులు ఆడిన సూర్య 187.43 స్ట్రైక్ రేట్ తో 1164 పరుగులు చేశాడు. ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్నాడు. 


అందుకు నేను లక్కీ


క్రికెటర్ గా తన ఎదుగుదలలో భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ప్రభావం చాలా ఉందని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. వారిద్దరితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం తన అదృష్టమని పేర్కొన్నాడు. అంతేకాక వారిద్దరిని క్రికెట్లో వారొక ప్రత్యేకమైన జాతి అని అభివర్ణించాడు. 'రోహిత్, కోహ్లీలతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం నా అదృష్టం. వారు అంతర్జాతీయ క్రికెట్ లో భిన్నమైన జాతి. వారు సాధించినవాటిని నేనప్పటికీ సాధించగలనో నాకు తెలియదు. ఇటీవల విరాట్ భాయ్ తో కలిసి కొన్ని మంచి భాగస్వామ్యాలను నిర్మించాను. అతనితో బ్యాటింగ్ ను నేను ఆస్వాదిస్తాను. అలాగే రోహిత్ నాకు అన్నయ్యలాంటివాడు. నాకు ఆటలో ఏమైనా సందేహాలంటే అతన్నే అడుగుతాను. 2018 ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ లో చేరినప్పటి నుంచి రోహిత్ తో నాకు మంచి బంధం ఏర్పడింది. అప్పటి నుంచి నాకతను మార్గదర్శకంగా ఉన్నాడు.' అని సూర్య చెప్పాడు. 


'ప్రపంచ నెంబర్ వన్ టీ20 బ్యాటర్' ఇదింకా నాకు కలలానే ఉంది


'ప్రపంచంలోనే టీ20ల్లోనే నన్ను నెంబర్ వన్ బ్యాటర్ గా పిలవడం నాకింకా కలగానే అనిపిస్తోంది. ఈ ఫార్మాట్ లో ఆడుతున్నప్పుడు అత్యుత్తమంగా ఆడాలని కోరుకున్నాను. అలాగే ఆడుతున్నాను. ఇందుకోసం నేను చాలా శ్రమించాను.' అని సూర్య అన్నాడు. దేశవాళీల్లో నిలకడగా రాణించినప్పటికీ సూర్యకు అంతర్జాతీయ జట్టులో త్వరగా చోటు దక్కలేదు. అయితే ఇప్పుడు వచ్చిన అవకాశాలను అద్భుతంగా ఉపయోగించుకుని మేటి క్రికెటర్ గా ఎదుగుతున్నాడు. ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్న సూర్య శ్రీలంకతో టీ20 సిరీస్ కు సన్నద్ధమవుతున్నాడు. 


Also Read: Jaydev Unadkat Comeback: అరంగేట్రానికి, రెండో మ్యాచ్ కు మధ్య 12 ఏళ్ల గ్యాప్- ట్విట్టర్ లో ఉనద్కత్ పోస్ట్ వైరల్