Under-19 World Cup India: అండర్-19 వరల్డ్ కప్‌లో భారత జట్టు విజయపరంపర కొనసాగుతోంది. లీగ్ దశలోని మూడు మ్యాచ్‌లకు మూడు మ్యాచుల్లో విజయం సాధించిన యువ భారత జట్టు.. సూపర్ సిక్స్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లను భారీ విజయాన్ని నమోదుచ చేసింది. మంగళవారం రాత్రి వరకు బ్లూంఫోంటీన్‌లోని మౌంగాంగ్ ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్‌పై 214 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టానికి 295 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో 28.1 ఓవర్లలో 81 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ఎస్‌కే పాండే నాలుగు వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించగా, ఆర్ లింబాని రెండు, ముషీర్ ఖాన్ రెండు, ఎన్ తివారీ, ఏ కులకర్ణి చెరో వికెట్ తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
ముషీర్ ఖాన్ ఆల్‌రౌండ్ షోతో ఘన విజయం
భారత జట్టు కీలక ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో రాణించడంతో మెరుగైన స్కోర్‌ను చేయగలిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టులో ఓపెనర్ ఆదర్శ్ సింగ్ 52(58) పరుగులు చేయగా, వన్‌డౌన్‌లో వచ్చిన ముషీర్ ఖాన్ అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టాడు. 126 బంతుల్లో మూడు సిక్సులు, 13 ఫోర్లు సహాయంతో 131 పరుగులు చేసిన ముషీర్ ఖాన్ జట్టు భారీ స్కోర్ చేసేందుకు బాటలు వేశాడు. కెప్టెన్ యూ సహారన్ 57 బంతుల్లో 34 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ ఏఏ రావు 17(18), పి మోల్యా 10(12), ఎస్ దాస్ 15(11) పరుగులు చేసి జట్టుకు మెరుగైన స్కోరును అందించి పెట్టారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఎం క్లార్కే నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ ఆదర్శ్ సింగ్, వన్ డౌన్ ఆటగాడు ముషీర్ ఖాన్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించడంతో భారత్ జట్టు భారీ పరుగులు చేయగలిగింది. తొలుత నెమ్మదిగా ఆడిన వీరిద్దరూ ఆ తరువాత గేర్లు మార్చడంతో భారీగా స్కోరు బోర్డుపై పరుగులు చేరాయి.
తడబడిన న్యూజిలాండ్ జట్టు
లక్ష్యం పెద్దదే అయినా కష్టసాధ్యమైనది అయితే మాత్రం కాదు. కానీ, న్యూజిలాండ్ జట్టు ఘోరమైన ఆటతీరుతో లక్ష్యాన్ని చేరుకోవడంలో చతికిలపడింది. భారత బౌలర్లు ధాటికి న్యూజిలాండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఓపెనర్ టి జోన్స్ ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ కావడంతో డకౌట్‌గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ వన్‌డౌన్ బ్యాటర్ ఎస్‌ఆర్ దేవిరెడ్డి 0(4) డకౌట్ కాగా, ఎల్ స్టాక్ పోలే 5(9), కెప్టెన్ ఓటీ జాక్షన్ 19(38), ఓ తివాటియా 7 (14), జెడ్‌ఏజే కమింగ్ 16(26), వికెట్ కీపర్ ఏఎక్స్ థామ్సన్ 12(27), ఈడబ్ల్యు స్కెడూర్ 7(17), ఆర్ సోగర్స్ 0(3) పరుగులు చేశారు. ఎం క్లార్కే మూడు బంతులు ఆడి పరుగులేమీ చేయకుడా నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో కేఎస్ పాండే నాలుగు వికెట్లతో న్యూజిలాండ్ జట్టు పతనాన్ని శాసించాడు. ఆర్ లింబానీ రెండు, ముషీర్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఏ కులకర్ణి, ఎన్ తివారీ ఒక్కో వికెట్ పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.