Team India Reaches New York Ahead Of T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ మహాసమరం కోసం బయలుదేరిన రోహిత్ సేన న్యూయార్క్ చేరుకుంది. కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తో పాటు, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, అర్ష్ దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, శివమ్ దూబేతో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా అమెరికాకు చేరుకున్నారు. టీ 20 ప్రపంచ కప్ 2024 (T20 World Cup 2024) మరో ఐదు రోజుల్లో ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని జట్లు ఒక్కొక్కటిగా అమెరికాకు చేరుకుంటున్నాయి.
ఐపీఎల్ ప్లేఆఫ్స్ ముగీసిన వెంటనే మే 25 శనివారమే ఫైనల్ టీం లో ఉన్న క్రికెటర్లు తప్ప మిగిలినవాళ్లంతా అమెరికా ఫ్లైట్ ఎక్కగా తాజాగా వీరు న్యూయార్క్‌లో ల్యాండ్ అయ్యారు. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌తోపాటు కెప్టెన్ రోహిత్ శర్మ, రిషభ్ పంత్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, సిరాజ్‌లు న్యూయార్క్ చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ (BCCI) తన అధికారిక ఎక్స్ ఖాతాలో ‘టచ్‌డౌన్ న్యూయార్క్’ అంటూ షేర్ చేసింది.
టీ 20 ప్రపంచకప్‌లో ఇండియా షెడ్యూల్
ఇండియా వర్సెస్ ఐర్లాండ్ - జూన్ 5 (న్యూయార్క్)
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ - జూన్ 9 ( న్యూయార్క్)
ఇండియా వర్సెస్ యూఎస్ఏ - జూన్ 12 (న్యూయార్క్)
ఇండియా వర్సెస్ కెనడా - జూన్ 15 (ఫ్లోరిడా)
ఇండియా వర్సెస్ ఐర్లాండ్ - జూన్ 5 (న్యూయార్క్)
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ - జూన్ 9 ( న్యూయార్క్)
ఇండియా వర్సెస్ యూఎస్ఏ - జూన్ 12 (న్యూయార్క్)
ఇండియా వర్సెస్ కెనడా - జూన్ 15 (ఫ్లోరిడా)
జూన్ 1 నుంచి ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా(USA)తో కెనడా తలపడబోతోంది. జూన్ 1న ప్రారంభంకానున్న టీ 20 వరల్స్ కప్ జూన్ 29న ముగుస్తుంది. ఈ మెగా టోర్నీలో గ్రూప్ ఏ లో భారత్ , పాకిస్థాన్ జట్లు ఉన్నాయి. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే భారత్ పాక్ మధ్య సమరం న్యూయార్క్ వేదికగా జూన్ 9న జరగనుంది. ఇక భారత జట్టు గ్రూప్ దశలో జూన్ అయిదున, ఐర్లాండ్‌తో పన్నెండవ తేదీన అమెరికాతో 15వ తేదీన కెనడాతో తలపడనుంది.
ఆ మూడు మ్యాచ్‌లకు రిజర్వ్ డే..
టీ 20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్‌తో పాటు ఫైనల్‌కు కూడా రిజర్వ్ డేను కేటాయిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. రెండు సెమీస్ మ్యాచ్‌లూ జూన్ 27న జరగనుండగా.. ఫైనల్‌ను జూన్ 29న నిర్వహిస్తారు. ఈ మూడు మ్యాచ్‌లకు రిజర్వ్ డేలను నిర్వహిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
ఇండియా టీ 20 జట్టు :
రోహిత్ శర్మ (కెప్టెన్ ), రిషబ్ పంత్ (వికెట్ కీపర్ ),సంజు శాంసన్ (వికెట్ కీపర్ ), హార్దిక్ పాండ్య (వికెట్ కీపర్ ), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్ , అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, ముహమ్మద్ సిరాజ్,యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్,

స్టాండ్ బై : ఖలీల్ అహ్మద్, అవేశ్‌ఖాన్, శుభ్‌మన్ గిల్, రింకు సింగ్