Top 5 Controversial Decisions And Issues In IPL 2024 : ఈ ఐపీఎల్(IPL) సీజన్‌లో ఎన్నో రికార్డులు. మరెన్నో ప్రత్యేకతలు. క్రికెట్ అభిమానులకు వినోదం పంచాయి. అలాగే వివాదాలు కూడా ఐపీఎల్‌ను వెన్నాడాయి. వాటిల్లో ఎక్కువగా అంపైరింగ్ నిర్ణయాలు అటు ఆటగాళ్లకు, ఇటు ప్రేక్షకులకు అసహనం తెప్పించాయి. తప్పుడు నిర్ణయాలతో మ్యాచ్‌ ఫలితాలు మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. చివరకు రివ్యూలు చూసి కూడా థర్డ్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని అభిమానులు మండిపడ్డారంటే వివాదాలు ఏ స్థాయిలో ఉన్నాయే అర్థంచేసుకోవచ్చు. 


విరాట్ కోహ్లీ నో బాల్   (RCB vs KKR)


ఈ ఐపిఎల్ లో ఒక  వివాదాలకు కింగ్ కోహ్లీ  బలైపోయాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో హర్షిత్‌ రాణా వేసిన ఒక నోబాల్‌ అతడి బ్యాట్‌ పైభాగంలో తగిలి బౌలరే క్యాచ్‌ పట్టుకున్నాడు. ఫీల్డ్‌ అంపైర్‌ టెలివిజన్‌ అంపైర్‌ సాయం కోరితే...నడుము కంటే ఎక్కువ ఎత్తులో బంతి వచ్చినట్లు స్పష్టంగా కనిపించింది. అయినా థర్డ్‌ అంపైర్‌ కోహ్లీని ఔట్‌గా ప్రకటించాడు. ఆ నిర్ణయానికి కోహ్లీనే ఆశ్చర్యపోయాడు. కింగ్ అభిమానులైతే థర్డ్‌ అంపైర్‌పై దుమ్మెత్తిపోశారు. 


సంజు శాంసన్ (DC vs RR)
గుజరాత్‌ టైటాన్స్‌-రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌లో రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజుశాంసన్‌కు గుజరాత్‌ పేసర్‌ మోహిత్‌శర్మ ఆఫ్‌ స్టంప్‌కు దూరంగా ఓ బంతిని విసిరాడు. దాన్ని ఆడేందుకు శాంసన్‌ ఆఫ్‌ సైడ్‌ వైపు జరిగాడు. కానీ ఫీల్డ్‌ అంపైర్‌  వైడ్‌గా ప్రకటించాడు. రివ్యూ చూస్తే శాంసన్‌ కదలికలను బట్టి బంతి వైడ్‌ కానట్లే కనిపించింది. రెండు సార్లు రిప్లే చూసికూడా ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయానికే థర్డ్ అంపైర్ ఓటు వేశాడు. దీంతో ఆశ్చర్యపోవడం గుజరాత్ వంతైంది. 


ఇదే మ్యాచ్ లో సంజు శాంసన్‌ ఔట్‌ కారణంగా ఢిల్లీ  క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ గెలిచే స్థితి నుంచి ఓడిపోయింది. ముకేశ్‌ కుమార్‌ వేసిన 16వ ఓవర్లో సంజు కొట్టిన భారీ షాట్‌ని బౌండరీ లైన్‌ దగ్గర షై హోప్‌ అందుకున్నట్లే అందుకున్నాడు. కానీ అతడి పాదం కొంచెం బౌండరీ లైన్‌కు తగిలినట్లు కనిపించింది. దీంతో ఫీల్డ్‌ అంపైర్‌.. మూడో అంపైర్‌ ను సాయం కోరాడు. విజువల్స్‌ చూస్తే హోప్‌ పాదం బౌండరీని టచ్‌ చేసినట్లు స్పష్టంగానే కనిపించింది. కానీ సంజు ఔట్‌ అని థర్డ్‌ అంపైర్‌ ప్రకటించడం పెద్ద వివాదాన్ని రాజేసింది.


ఆయుష్ బడోని రన్-అవుట్ (LSG vs MI)
లఖ్‌నవూ-ఢిల్లీ  మ్యాచ్‌లో ఇషాంత్‌శర్మ వేసిన బంతి లెగ్‌సైడ్‌ పడిందని అంపైర్‌ వైడ్‌ ఇచ్చాడు. రివ్యూకి వెళితే టీవీ అంపైర్‌ వైడ్‌ కాదని తేల్చాడు. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ బ్యాటర్‌ ఆయుష్‌ బదోని రనౌట్‌ వివాదాస్పదమైంది. 


రహ్మానుల్లా గుర్బాజ్ (ఫైనల్)
 ఆఖరుకు ఫైనల్ మ్యాచ్‌లో కోల్ కతా బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్... ఎల్బీ కూడా వివాదాస్పదమైంది. ఫీల్డ్ అంపైర్ నిర్ణయం తప్పని విశ్వాసంతో కనిపించిన గుర్బాజ్.. థర్డ్ అంపైర్‌ నిర్ణయంతో నివ్వెరపోయాడు. కామెంటర్‌ గా ఉన్న రవి శాస్త్రి బాల్ ట్రాకింగ్, ఆల్ట్రా ఎడ్జ్ సరిగా పనిచేయడంలేదని చెబుతున్న సమయంలోనే ఎల్బీగా థర్డ్ అంపైర్ నిర్ణయించడంతో గుర్బాజ్ అసహనంతో మైదానాన్ని వీడాడు. 


రోహిత్ శర్మ ఆడియో వైరల్ 
ఈ సీజన్‌లోనే అసలైన వివాదం హిట్‌ మ్యాన్ రోహిత్ శర్మ తన మిత్రుడు  కేకేఆర్‌ అసిస్టెంట్ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌తో మాట్లాడిన వీడియోను బయటపెట్టడం.
వీడియో తీయవద్దని రోహిత్ సూచించినా కూడా కెమెరామెన్ చిత్రీకరించడం, దాన్ని కేకేఆర్‌ ట్వీట్ చేయడం వివాదంగా మారింది. ఆ వీడియోలో రోహిత్ చెప్పిన మాటలు స్పష్టంగా వినిపించకపోయినా ‘‘భాయ్‌ నాదేముంది.. ఇదే చివరిది’’అని అన్నట్లు ప్రచారం జరిగింది. ధాని ఆధారంగా ఆయన ముంబయి ఇండియన్స్‌ను వీడుతున్నట్లు ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఈ వీడియోను పోస్ట్ చేయడంపై రోహిత్ శర్మ  మండిపడ్డాడు. క్రికెటర్ల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడవద్దని గట్టిగానే సూచించాడు. వ్యూస్ పెంచుకోవడం కోసం ఇలాంటి వైఖరి సరికాదని 
ఎక్స్‌ లో పోస్ట్ చేశాడు.