South Africa vs Afghanistan Score : ఈ ప్రపంచకప్‌లో అద్భుతాలు సృష్టిస్తున్న అఫ్ఘానిస్థాన్ మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. టాస్ గెలిచిన అఫ్ఘాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. అఫ్గాన్ కెప్టెన్ షాహిదీ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేసి ఛేజింగ్‌లో దక్షిణాఫ్రికాను ఉక్కిరిబిక్కిరి చేయాలని చూస్తున్నాడు. ఆస్ట్రేలియాతో గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయిన అఫ్గాన్ జట్టు.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం సాధించడంతో... ఈ మ్యాచ్‌లో సఫారీ జట్టును అఫ్గాన్ భారీ తేడాతో ఓడించాల్సి ఉంది. కానీ భీకర ఫామ్‌లో ఉండి ఇప్పటికే సెమీస్ చేరిన దక్షిణాఫ్రికాను అఫ్గాన్ జట్టు అంత భారీ తేడాతో ఓడించి ఫైనల్ చేరడం అంత తేలికైన పనేమీ లేదు. కానీ ఇప్పటికే ఈ ప్రపంచకప్‌లో శ్రీలంక, పాకిస్థాన్, ఇంగ్లండ్‌లను ఓడించి.. అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించినంత పనిచేసిన అఫ్గాన్ ఈ మ్యాచ్‌లోనూ దక్షిణాఫ్రికాకు షాక్ ఇవ్వాలని చూస్తోంది. ఇటు సెమీఫైనల్స్‌కు ముందు లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకోవాలని దక్షిణాఫ్రికా చూస్తోంది.
ఈ ప్రపంచకప్‌లో తమ పోరాటంతో అఫ్గానిస్థాన్ క్రికెట్ ప్రేమికుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేయాలని అఫ్గాన్ పట్టుదలతో ఉంది. ఫలితంతో సంబంధం లేకుండా మళ్లీ మంచి ప్రదర్శన చేయాలని అఫ్గాన్ భావిస్తోంది. ఎనిమిది మ్యాచుల్లో నాలుగు విజయాలతో ఇప్పటికీ సెమీస్ పోరులో ఉండడం సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న అఫ్గాన్.. అద్భుతం సృష్టించగలమన్న నమ్మకంతో ఉంది. ఇంగ్లండ్, పాకిస్తాన్‌లను ఓడించిన హస్మతుల్లా షాహిదీ నేతృత్వంలోని అఫ్గాన్ జట్టుకు... సఫారీ జట్టుపైన గెలుపు అంత కష్టం కాదని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ ఆస్ట్రేలియాపై మ్యాక్స్‌వెల్ విధ్వంసంతో ఆఫ్ఘన్‌లకు గుండెలు పగిలేలా చేసింది. తొలుత బ్యాటింగ్ చేయడంలో దక్షిణాఫ్రికా ఈ టోర్నీలోనే అత్యుత్తమంగా నిలిచింది.
ఆఫ్ఘాన్ స్పిన్నర్లు స్థాయికి తగ్గట్లు రాణిస్తే దక్షిణాఫ్రికాకు కష్టాలు తప్పకపోవచ్చు. పేసర్లు కూడా అఫ్గాన్‌కు అంచనాలు మించి రాణిస్తున్నారు. నవీన్ ఉల్ హక్, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఆస్ట్రేలియాపై కొత్త బంతితో బాగా రాణించారు. మరోసారి వీళ్లు రాణిస్తే దక్షిణాఫ్రికాకు కష్టాలు తప్పకపోవచ్చు. ఈ టోర్నమెంట్‌లో అఫ్గాన్ ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ కూడా బాగా రాణిస్తోంది. ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, కెప్టెన్ షాహిదీ మెరుగ్గా రాణిస్తున్నారు. ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్, మహ్మద్ నబీ నుంచి అఫ్గాన్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. క్వింటన్ డికాక్ భీకర ఫామ్‌లో ఉండడం దక్షిణాఫ్రికాకు కలిసిరానుంది. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా వరుసగా విఫలమవుతుడడం సఫారీలకు ఆందోళన కలిగిస్తోంది. సెమీఫైనల్స్‌కు ముందు, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లో రాణించాలని బవుమా పట్టుదలగా ఉన్నాడు. డేవిడ్ మిల్లర్ టాప్ ఫినిషర్‌గా ఉన్నాడు. నాకౌట్ దశకు ముందే సమస్యలన్నీ పరిష్కరించుకోవాలని ప్రొటీస్ భావిస్తోంది. స్పిన్నర్ కేశవ్ మహారాజ్ మెరుగ్గా బౌలింగ్ చేయడం వారికి కలిసొస్తోంది.
ఆఫ్ఘానిస్తాన్ జట్టు: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహమత్ షా, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహమాన్, నౌర్ అబ్దుల్, హక్
దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డికాక్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, ఆండిల్ ఫెహ్లుక్వాయో, కగిసో రబడా.