ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచుల్లో ఓడిపోయి.. సిరీస్‌ను కోల్పోయిన అనంతరం టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళల ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ నిర్వహిస్తే బాగుంటుందని మంధాన అభిప్రాయపడింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ నిర్వహిస్తే మంచిదని... కానీ దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం ఐసీసీనే అని తెలిపింది. పురుషుల ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఉన్నట్లే... మహిళలు కూడా ఛాంపియన్ షిప్‌లో ఆడితే చాలా బాగుంటుందని మందాన్న అభిప్రాయపడింది. అయితే ఇంగ్లాండ్ వెటరన్ ప్లేయర్ టామీ బ్యూమాంట్ మాత్రం మహిళల ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ వద్దని ఖరాఖండీగా చెప్పేసింది. కేవలం భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రమం తప్పకుండా మహిళల టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్న నేపథ్యంలో.. డబ్ల్యూటీసీ నిర్వహించడం అన్యాయమని వ్యాఖ్యానించింది. ఇప్పుడు మూడు నాలుగు దేశాలకు మాత్రమే మహిళల టెస్టు మ్యాచ్‌లు నిర్వహించే సామర్థ్యం ఉందని ఆమె అభిప్రాయపడింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPLపైనా బీసీసీఐ దృష్టి సారించింది. వచ్చే సీజన్‌కు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 వేలానికి సంబంధించిన తేదీని ప్రకటించింది. ముంబయి(Mumbai) వేదికగా డిసెంబర్ 9న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చిలో ఈ లీగ్ జరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఈసారి బెంగళూరు, ముంబై వేదికగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. మరో నాలుగు రోజుల్లో మహిళా ప్రీమియర్ లీగ్ సీజన్‌కు సంబంధించి వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టు కెప్టెన్ స్మృతీ మంధాన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలు జరిగే పద్ధతిలోనే తమ మ్యాచ్‌లనూ నిర్వహించాలని మంధాన కోరింది. మహిళా ప్రీమియర్ లీగ్ అభిమానుల ఆదరణను చూరగొందని పేర్కొంది. విభిన్న నగరాల్లో మహిళా ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు జరగాలనేది తన కోరికని స్టార్ బ్యాటర్ స్మృతీ మంధాన తన మనసులోని మాట బయటపెట్టారు. అలా జరిగితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మరో అడుగు ముందుకేసినట్లు అవుతుందని తెలిపారు. నిర్వాహకులు ఆ దిశగా ఆలోచిస్తారని భావిస్తున్నాని మంధాన వెల్లడించారు.
ఇప్పటికే మహిళా క్రికెట్ పురోగతి సాధించిందని.. విభిన్న నగరాల్లో మ్యాచ్‌లను నిర్వహిస్తే కొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు వీలుంటుందని మంధాన అభిప్రాయపడ్డారు. WPL వేలంలో అత్యుత్తమ ప్లేయర్లను తీసుకోవడానికి ప్రయత్నిస్తామని తేల్చి చెప్పారు. కామన్‌వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్‌లో మహిళలు జట్టు పతకాలు సాధించిందని గుర్తు చేసిన ఈ స్టార్ బ్యాటర్.... గత పదేళ్ల నుంచి పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళా క్రికెట్ వృద్ధి చెందిందని తెలిపారు. మహిళా క్రీడాకారులకు దన్నుగా నిలిస్తే భవిష్యత్తులో మెరుగైన ప్రదర్శన చేస్తారని మంధాన ఆశాభావం వ్యక్తం చేశారు. ముంబయివేదికగా డిసెంబర్ 9న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ప్రక్రియ జరగనుంది. మహిళా ప్రీమియర్ లీగ్ రెండో ఎడిషన్ వేలానికి సంబంధించి జాబితాను నిర్వాహకులు విడుదల చేశారు. మొత్తం 165 మంది క్రికెటర్లు తమ పేరును నమోదు చేసుకున్నారు. మొత్తం 165 మందిలో 104 మంది భారత క్రికెటర్లు కాగా.. 61 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. మరో 15 మంది అసోసియేట్ దేశాల నుంచి కూడా తమ పేర్లను నమోదు చేసుకున్నారు.