Shubman Gill and Ridhima Pandit marrgige Rumours: పదేళ్ల చిన్నవాడైన శుభ్‌మన్‌గిల్‌ను టీవీ నటి రిద్ధిమా పండిట్ పెళ్లి చేసుకోబోతోందని ప్రచారంపై ఆమె స్పందించారు. వచ్చే డిసెంబర్‌లో పెళ్లి జరగబోతోందని పుకార్లు నడుస్తున్నాయి. 


క్రికెటర్ శుభ్‌మన్‌ గిల్‌ పెళ్లి వార్తలు మరోసారి గుప్పుమన్నాయి. టీవీ నటి రిద్దిమా పండిట్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్టు గుసగుసలు వినిపించాయి. అయితే వీటిపై రిద్దిమా క్లారిటీ ఇచ్చారు.


రిద్ధిమా పండిట్‌, శుభ్‌మన్ గిల్‌ ప్రేమలో ఉన్నారని డిసెంబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నారని పెద్ద స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ విషయంపై చాలా మంది మీడియా వ్యక్తులు రిద్ధిమాకు ఫోన్లు చేయడంతో ఆమె స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేశారు. 


శుభ్‌మన్‌గిల్‌ను తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని చెప్పారు. అసలు ఈ పుకారు ఎలా పుట్టిందో కూడా తనకు అర్థం కావడం లేదని అన్నారు. ప్రస్తుతానికి తాను సినిమా కెరీర్‌పై దృష్టి పెట్టానని పెళ్లి ఆలోచన లేదన్నారు. 


శుభ్‌మన్‌ గిల్ కంటే రిద్ధిమా పండిట్‌ పదేళ్లు పెద్దది. వీళ్లిద్దరి మధ్య పెళ్లి చర్చలు జరుగుతున్నాయని... ఈ డిసెంబర్‌లో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పుకార్లు రావడంతో ఆమె క్లారిటీ ఇచ్చారు. "నా వివాహం గురించి అడుగుతూ చాలా మంది జర్నలిస్టుల కాల్స్ చేస్తున్నారు. దీంతో నేను అలర్ట్ అవ్వాల్సి వచ్చింది. వివాహం ఏంటీ? నేను చేసుకోవడం ఏంటీ? ఇప్పట్లో నేను పెళ్లి చేసుకోను. నా జీవితంలో అలాంటి సందర్భం వస్తే కచ్చితంగా నేనే వచ్చి అందరికీ తెలియజేస్తాను" అని అన్నారు.




ఇప్పటికే సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌తో శుభ్‌మన్‌ గిల్ ప్రేమలో ఉన్నారని ప్రచారం నడుస్తోంది. గిల్ ఆడిన ప్రతి చోటకు సారా వస్తుందని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. ఇంతోల సీన్‌లోకి రిద్ధిమా పండింట్‌ రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఆమె ఇచ్చిన క్లారిటీతో పుకార్లకు ఫుల్‌స్టాప్ పడినట్టు అయింది. 


బిగ్‌బాస్ మొదటి సీన్‌లో అలరించిన రిద్ధిమా 'బహు హమారీ రజనీకాంత్'లో నటించారు. దీని ద్వారానే రిద్ధిమా పండిట్‌కు మంచి పాపులారిటీ వచ్చింది. ఇందులో రోబోగా ఆమె నటించారు. "ఖత్రా ఖత్రా ఖత్రా" వంటి టీవీ షోల్లో కూడా పాల్గొన్నారు.


ఇటీవలే ఓ నేషనల్ ఛానల్‌తో మాట్లాడుతూ... టీవీ ప్రోగ్రామ్స్‌ షూటింగ్‌లో జరుగుతున్న అరాచకాలపై స్పందించారు. ఓ షోలో చేస్తున్నప్పుడు తన తల్లి ఆరోగ్యం బాగాలేక ఐసీయూలో పెడితే వెళ్లేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. ఇలాంటి వాటిపై ఎవరూ మాట్లాడకపోవడం దారుణం అన్నారు.