Rohit Sharma, Rahul Dravid In New York:  క్రికెట్ అభిమాలులు ఎంతో ఆసక్తిగా  ఎదురుచూస్తున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్(T20 World Cup) 2024కు స‌మయం ఆసన్నం అయింది. అమెరికా(USA), వెస్టిండీస్(West indies) దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్  జూన్ 2న ప్రారంభం  కానుంది.  మ్యాచుల్లో పాల్గొనేందుకు భార‌త జ‌ట్టు  న్యూయార్క్‌కు చేరుకుంది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌తో పాటు మిగిలిన ఆట‌గాళ్లు  ఓ వైపు బౌలింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూనే మరోవైపు సరదాగా న్యూయార్క్ వీధుల్లో చక్కర్లు  కొడుతున్నారు. ఉత్సాహంగా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు.

  


ఈ నేపధ్యంలో  టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), కోచ్ రాహుల్ ద్రవిడ్‌(Rahul Dravid)ల వీడియో ఒకటి  వైరల్‌ అయ్యింది . ఈ వైరల్ వీడియోలో, ఇద్దరూ ఒక కాఫీ షాప్ నుంచి వస్తూ   కనిపించారు.  ఇద్దరు టీ-షర్ట్ షార్ట్‌లో  దర్శనమిచ్చారు. సరదాగా కలిసి బయటకు  వెళ్లిన వీరిద్ద‌రు భారీ వ‌ర్షం కార‌ణంగా ఒక షాపులో ఉండిపోయారు. ఇంత‌లో అక్క‌డ‌ ఉన్న కు ఓ అభిమాని వ‌చ్చి  ఫోటో కావాల‌ని రోహిత్ శ‌ర్మ‌ను అడిగాడు. ఇప్పుడు వ‌ద్దు.. బ‌య‌ట బాగా వ‌ర్షం ప‌డుతోంది అన్న హిట్‌మ్యాన్  కారును తీసుకురావాల‌ని   డ్రైవ‌ర్‌కు సైగ చేశాడు. వ‌ర్షంలో పరిగెత్తుతూ  రోహిత్‌, ద్ర‌విడ్ ఇద్ద‌రు కారు ఎక్కేశారు. ఇద్దరు వానలో తడిచిన  వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 






టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు రెండు వార్మప్ మ్యాచ్లు ఉన్నాయి.  భార‌త జ‌ట్టు జూన్ 1న బంగ్లాదేశ్‌తో ఒక వార్మప్  మ్యాచ్‌ను ఆడ‌నుంది. ఇక ప్ర‌పంచ‌క‌ప్‌లో టీం ఇండియా ఆట ఐర్లాండ్‌తో జూన్ 5న ప్రారంభమవ్వనుంది. ఇక అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూసే భార‌త్, పాకిస్తాన్ దాయాది  జ‌ట్ల మ‌ధ్య పోరు  జూన్ 9న జ‌ర‌గ‌నుంది.  భారతదేశం, బంగ్లాదేశ్ ICC T20 ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్‌ న్యూయార్క్‌లోని నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను రోహిత్ శర్మ  సందర్శించాడు. మరోవైపు అమెరికాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ కోసం భారత క్రికెట్‌ స్టార్‌ విరాట్‌ కోహ్లీ  అమెరికా చేరుకున్నాడు. అటు రింకు సింగ్ కూడా టీంలో జాయిన్ అయ్యాడు. 


భారత క్రికెట్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్


రిజర్వ్‌ బెంచ్ ఆటగాళ్లు : శుభమన్ గిల్,ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, రింకూ సింగ్,