Shane Warne Passes Away: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. వార్న్ ఇక లేడన్న విషయాన్ని క్రికెట్ ప్రేమికులతో పాటు ప్రస్తుత క్రికెటర్లు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఓ లెజెండరీ క్రికెటర్‌ను కోల్పోయాయంటూ సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. క్రికెట్ ప్రపంచానికి వార్న్ మరణం తీరని లోటు. క్రికెట్ ప్రపంచానికి వార్న్ చేసిన సేవల్ని మనం గుర్తుంచుకోవాలి. ఎన్నో మైలురాళ్లు చేరుకున్న షేన్ వార్న్ ఇలా చనిపోవడం బాధాకరం అన్నాడు. అతని కుటుంబానికి, అతని ముగ్గురు పిల్లలు మరియు ప్రియమైనవారికి రోహిత్ శర్మ సానుభూతి తెలియజేశాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. వార్న్ మరణం చాలా బాధాకరం అన్నాడు.
నివాళి తెలిపిన గంటల్లోనే విషాదం..
శనివారం ఉదయం ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, వికెట్ కీపర్ రాడ్ మార్ష్ (74) కన్నుమూశారు. పలువురు తాజా, మాజీ క్రికెటర్లు సహా షేన్ వార్న్ సైతం తమ దేశానికి చెందిన మాజీ ఆటగాడు రాడ్ మార్ష్‌కు నివాళి అర్పించారు. కానీ కొన్ని గంటల్లోనే ఊహించని విషాదం చోటుచేసుకుంది. థాయ్‌ల్యాండ్‌లోని కోహ్ సముయ్ ప్రాంతంలోని ఒక విల్లాలో ఉంటున్న వార్న్‌కు గుండెపోటు రావడంతో రాత్రి హఠాన్మరణం చెందాడు. ఆస్ట్రేలియాతో పాటు క్రికెట్ ప్రేమికులకు ఇది తీరని విషాదమని చెప్పవచ్చు.
Also Read: Shane Warne Death: ఆస్ట్రేలియన్ స్టార్ స్పిన్నర్ షేన్ వార్న్ ఆకస్మిక మృతి - గుండెపోటే కారణమా?