Sania Shoaib Divorce: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెట్ ఆటగాడు షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరి విడాకుల వ్యవహారం తుది దశకు వచ్చిందని పాకిస్థాన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై మాలిక్ సన్నిహిత మిత్రుడొకరు స్పందించినట్లు సమాచారం. ఈ జంట అతి త్వరలోనే అధికారికంగా విడాకులు తీసుకోబోతున్నారని అతను చెప్పినట్లు తెలుస్తోంది. 


సానియా, షోయబ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ బాబు పుట్టినరోజు సందర్భంగా వారివురురూ వారి సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్టుల కారణంగా వారి మధ్య మనస్పర్థలు ఉన్నట్లు తెలిసింది. పాక్ నటి అయేషా ఒమర్ కారణంగానే వీరిద్దరూ విడిపోతున్నట్లు సమాచారం. 


పాకిస్థాన్ ప్రముఖ నటి అయేషా ఒమర్ తో షోయబ్ మాలిక్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరు గత కొన్ని నెలలుగా కలిసి కనిపిస్తున్నారు. అలాగే ఒక పత్రిక కోసం స్విమ్మింగ్ పూల్ లో షోయబ్, అయేషా కలిసి బోల్డ్ ఫొటో షూట్ నిర్వహించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె కారణంగానే సానియా, షోయబ్ లు విడాకుల నిర్ణయం తీసుకుంటున్నారని వారి సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.