T20 WC 2022 Semi-Final: భారత్- ఇంగ్లండ్ సెమీఫైనల్లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. టీమిండియా బౌలర్ అశ్విన్ బౌలింగ్ చేసేటప్పుడు ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ బట్లర్ నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్నాడు. బట్లర్ క్రీజును వదిలి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. కనీసం ఒక పాదాన్ని కూడా ముందుకు పెట్టలేదు. ఒకసారి ఐపీఎల్ లో తన బౌలింగ్ లో బట్లర్ ముందుకు వెళితే అశ్విన్ రనౌట్ (మన్కడింగ్) చేశాడు. అది దృష్టిలో పెట్టుకునే బట్లర్ అశ్విన్ బౌలింగ్ లో క్రీజు వదిలి ముందుకు రాలేదు. 


దీనిపై రాజస్థాన్ రాయల్స్ జట్టు ట్విటర్ లో ఒక పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం బట్లర్, అశ్విన్ లు ఇద్దరూ ఐపీఎల్ లో రాయల్స్ జట్టుకే ఆడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


10 వికెట్ల తేడాతో ఓడిన భారత్


సెమీఫైనల్ 2 లో ఇంగ్లండ్ చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. భారత్ నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఓపెనిర్లిద్దరే ఛేదించేశారు. మన బౌలర్లు పూర్తిగా తేలిపోయిన వేళ బట్లర్, హేల్స్ చెలరేగి ఆడారు. కేవలం 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి టీమిండియాకు తీరని వేదన మిగిల్చారు. 


అది మాట్లాడేందుకు ఇది వేదిక కాదు


'సెమీస్‌లో మా ప్రదర్శన నిరాశపరిచింది. ఫైనల్‌కు వెళ్లాలని అనుకున్నా. ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో మెరుగైన జట్టుగా నిలిచింది.మొత్తంమ్మీద, మేం చాలా మంచి క్రికెట్ ఆడాం. ఆటగాళ్లు మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మేం కొన్ని విషయాల్లో మెరుగుపడ్డాం. తదుపరి ప్రపంచ కప్ కోసం ఇవి ఉపయోగపడతాయి. మేం టోర్నమెంట్‌లో బాగా బ్యాటింగ్ చేశాం. ఆట ప్రారంభమైనప్పుడు, వికెట్ నెమ్మదిగా ఉందని జట్టు సభ్యులు చెప్పారు. చివరి ఓవర్లు బాగా సాగాయి. మేము 180 నుంచి 185 పరుగులు సాధించగలిగి ఉండాల్సింది.' అని భారత మాజీ కెప్టెన్ చెప్పాడు. సీనియర్ ఆటగాళ్ల భవితవ్యం గురించి మాట్లాడటానికి ఇది సరైన వేదిక కాదని ద్రవిడ్ అన్నారు.