Ravindra Jadeja Tweet:
టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సీఎస్‌కే ఫ్యాన్స్‌ను థ్రిల్ చేశాడు. నగరానికి చేరుకున్న అతడు 'వణక్కం చెన్నై' అంటూ మురిపించాడు. దాంతో తమకు ఇష్టమైన ఆటగాడు వచ్చాడని చాలామంది సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగులో అతడి ఆట కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు.
గతేడాది సెప్టెంబర్ నుంచి రవీంద్ర జడేజా క్రికెట్ మైదానానికి దూరమయ్యాడు. ఆసియాకప్‌లో హాంకాంగ్‌తో మ్యాచ్ ఆడుతుండగా అతడు గాయపడ్డాడు. ఆ తర్వాత బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో రీహబిలిటేషన్ పొందాడు. ఈ మధ్యే పూర్తి ఫిట్‌నెస్ సాధించి సౌరాష్ట్ర తరఫున రంజీ మ్యాచులు ఆడుతున్నాడు. తమిళనాడుతో ఫైనల్ లీగ్ స్టేజ్ మ్యాచ్ కోసం చెన్నైకి వచ్చాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగులో రవీంద్ర జడేజా చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించే సంగతి తెలిసిందే. అక్కడ అతడికి భారీగా అభిమానులు ఉన్నారు. పైగా బ్యాటు, బంతితో ఆ ఫ్రాంచైజీకి తిరుగులేని విజయాలు అందించాడు. ఇదే అనుబంధంతో నగరానికి రాగానే 'వణక్కం చెన్నై' అంటూ ట్వీట్ చేశాడు. ఆ పోస్టు చూసిన వెంటనే అభిమానులు స్పందించారు. 'జడేజాకు చెన్నై స్వాగతం చెబుతోంది. నా సీఎస్కే జట్టులో ఇష్టమైన ఆటగాడివి నువ్వే' అని ఒకరు బదులిచ్చారు. 'నా ఆరాధ్యుడు, నా రోల్ మోడల్, నాకిష్టమైన వ్యక్తికి వణక్కం. సింహం మళ్లీ మైదానంలో అడుగుపెట్టింది' అని మరొకరు ట్వీట్ చేశారు.
గతేడాది ఆసియా కప్‌లో హాంకాంగ్‌తో మ్యాచ్ ఆడుతున్నప్పుడు జడేజాకు మోకాలి గాయమైంది. ఇంగ్లాండ్‌తో జులై రీషెడ్యూలు చేసిన టెస్టు మ్యాచే అతనాడిక ఆఖరు ఫస్ట్ క్లాస్ మ్యాచ్. అప్పట్నుంచి క్రికెట్ ఆడలేదు. టీ20 ప్రపంచకప్‌లో అతడి సేవలను టీమ్‌ఇండియా ఎంతగానో మిస్సైంది. కోలుకున్న అతడిని ఆస్ట్రేలియాతో బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి ఎంపిక చేశారు.
మరికొన్ని రోజుల్లో భారత్, ఆస్ట్రేలియా అత్యంత కీలకమైన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో తలపడుతున్నాయి. ఫిబ్రవరి 9 నుంచే నాలుగు టెస్టుల సిరీసు మొదలవుతోంది. టీమ్‌ఇండియా తొలి రెండు టెస్టులకు జట్టును ప్రకటించింది. ఆసీస్ 18 మందిని ఎంపిక చేసింది.
భారత జట్టు : రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ యాదవ్
ఆస్ట్రేలియా జట్టు: ప్యాట్ కమిన్స్, ఏస్టన్ ఆగర్, స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, కామెరాన్ గ్రీన్, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నేథన్ లైయన్, లాన్స్ మోరిస్, టాడ్ మార్ఫీ, మాథ్యూ రెన్షా, స్టీవ్‌స్మిత్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్