Anshul Kamboj Record to Take All 10 Wickets in Innings Ranji History | రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం జరిగింది. హర్యానా పేసర్ అన్షుల్ కాంబోజ్ ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టాడు. రంజీల్లో ఈ ఘటన సాధించిన మూడో బౌలర్‌గా అన్షుల్ కాంబోజ్ నిలిచాడు. రోహ్‌తక్ లోని చౌదరి బన్సీ లాల్ క్రికెట్ స్టేడియంలో కేరళతో జరిగిన గ్రూప్ సి గేమ్‌లో 23 ఏళ్ల కాంబోజ్ ఈ ఘనత సాధించాడు. పేసర్ కాంబోజ్ చెలరేగడంతో ప్రత్యర్థి కేరళ జట్టుపై తాను వేసిన 30.1 ఓవర్లలో కేవలం 49 పరుగులు ఇచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. తాజా ప్రదర్శనతో కాంబోజ్ కేవలం 19 మ్యాచ్ లలోనే 50 ఫస్ట్ క్లాస్ వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో చేరాడు.


గతంలో ప్రేమాంగ్షు ఛటర్జీ, ప్రదీప్ సుందరం ఈ ఘనత సాధించారు. వీరిద్దరూ ఒకే ఇన్నింగ్స్ లో మొత్తం 10 వికెట్లు తమ ఖాతాలో తొలి ఇద్దరు బౌలర్లుగా నిలిచారు. తాజాగా అన్షుల్ కాంబోజ్ హిస్టరీ రిపీట్ చేస్తూ ఓ ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి జట్టు మొత్తం వికెట్లు దక్కించుకుని అద్భుతం చేశాడు. బెంగాల్‌ తరఫున రంజీల్లో ఆడిన ప్రేమాంగ్షు ఛటర్జీ 1956లో అస్సాంతో జరిగిన మ్యాచ్ లో కేవలం 20 పరుగులు ఇచ్చి 10 వికెట్లు తీశాడు. అనంతరం దాదాపు మూడు దశాబ్దాలకు రాజస్థాన్‌కు చెందిన ప్రదీప్ సుందరం ఈ ఫీట్ సాధించాడు. 1985లో విదర్భతో జరిగిన మ్యాచ్ లో 78 పరుగులు ఇచ్చి ప్రత్యర్థి జట్టు 10 వికెట్లు పడగొట్టాడు.






ఓవరాల్ గా చూస్తే ఓ ఇన్నింగ్స్ పదికి 10 వికెట్లు పడగొట్టిన ఆరో భారత బౌలర్ గా అన్షుల్ కాంబోజ్ నిలిచాడు. గతంలో అనిల్ కుంబ్లే, సుభాష్ గుప్తే, దేబాశిష్ మోహంతీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఈ రికార్డు సాధించారు. కేరళలో మూడో రోజు ఆటలో భాగంగా శుక్రవారం నాడు కాంబోజ్ పదునైన బంతులతో నిప్పులు చెరిగాడు. నేడు బాసిల్ థంపి, షౌన్ రోజర్ వికెట్లు పడగొట్టడంతో కాంబోజ్ ఓ ఇన్నింగ్స్ లో పది వికెట్లు తీసినట్లయింది. కాంబోజ్ అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థి కేరళ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 291 పరుగులకు ఆలౌటైంది. 



Also Read: Tim Southee: ఇంగ్లండ్‌తో ఆడేదే ఆఖరి మ్యాచ్- టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన టిమ్‌ సౌథీ  


టీమిండియా ఏ, ఐపీఎల్ లో ముంబైకి ప్రాతినిథ్యం


కాంబోజ్ కెరీర్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ ఆడుతున్నాడు అన్షుల్ కాంబోజ్. ఐపీఎల్ 2024 సీజన్ లో ముంబై కాంబోజ్ ను తీసుకుంది. ఒమన్ వేదికగా జరిగిన ఏసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్ టోర్నమెంట్ లో ఇండియా ఏ కి ప్రాతినిథ్యం వహించాడు పేసర్ కాంబోజ్. హర్యానా తొలిసారి విజయ్ హజారే ట్రోఫీ నెగ్గగా, పది మ్యాచ్ ల్లో 17 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా కాంబోజ్ సత్తా చాటాడు. ఈ రంజీ సీజన్ లో ఓ ఇన్నింగ్స్ లో 8 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మూడో బౌలర్. మోహంతీ, అశోక్ దిండాలు ఈ సీజన్ లో ఆ ఘనత సాధించిన తొలి ఇద్దరు బౌలర్లు.