Tim Southee Announces Test Retirement: న్యూజిలాండ్ వెటరన్ పేసర్ టిమ్ సౌథీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ డిసెంబర్‌లో స్వదేశంలో ఇంగ్లాండ్‌తో ఆడే సిరీస్ మాత్రమే ఆఖరిదని చెప్పాడు. ఆ సిరీస్‌లో ఆఖరి టెస్ట్ తన సొంత గ్రౌండ్‌లో ఆడేసి రెడ్ బాల్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వబోతున్నాడు. ఈ టెస్టు మ్యాచ్ న్యూజిలాండ్ ఇంగ్లండ్ మధ్య డిసెంబర్ 15-19 వరకు హామిల్టన్‌లోని సౌతీ హోమ్ గ్రౌండ్ సెడాన్ పార్క్‌లో జరగనుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్ ఆల్-టైమ్ లీడింగ్ వికెట్-టేకర్ సౌతీ జూన్‌లో జరిగే ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు జట్టు అర్హత సాధిస్తే అందుబాటులో ఉంటాడు.
సౌథీ న్యూజిలాండ్ తరపున 104 టెస్టు మ్యాచ్‌ల్లో 385వికెట్లు, 161 వన్డే మ్యాచ్‌ల్లో 221 వికెట్లు, 125 T20 మ్యాచ్‌లలో 164 వికెట్లు తీశాడు. 2008లో ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో స్వదేశీ T20ల్లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్ ఇంగ్లండ్‌పై ఆడాడు.
న్యూజిలాండ్ కోసం ఆడటం నా కల: సౌథీ
న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించడం చిరకాల స్వప్నమని, 18 ఏళ్లుగా బ్లాక్ క్యాప్ కోసం ఆడడం గౌరవమని అన్నాడు. తనకు ఎంతో గుర్తింపు తీసుకొచ్చిన ఆట నుంచి వైదొలగడానికి ఇదే సరైన సమయమని టిమ్ సౌథీ అభిప్రాయపడ్డాడు.
"న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించేలా ఎదగాలని కలలుకన్నాను. 18 సంవత్సరాలుగా బ్లాక్‌క్యాప్స్‌కు ఆడటం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. కానీ చాలా ఇచ్చిన ఆట నుంచి వైదొలగడానికి సరైన సమయం. టెస్ట్ క్రికెట్‌కి నా హృదయంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అరగేంట్రం చేసిన జట్టుపైనే ఆఖరి పెద్ద సిరీస్ ఆడగలుగుతున్నాు. మూడు మైదానాల్లో నాకు చాలా ప్రత్యేకమైనవి. బ్లాక్ క్యాప్‌తో నా ప్రయాణం ముగించడానికి ఇది సరైన మార్గంగా భావిస్తున్నాను. " అని టిమ్ సౌథీ చెప్పాడు.
300 టెస్ట్ వికెట్లు, 200 వన్డే వికెట్లు 100 T20I వికెట్లు సాధించిన ఏకైక ఆటగాడిగా సౌథీ అద్భుతమైన ఆల్ రౌండ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. “ఇన్ని సంవత్సరాలుగా నాకు నా కెరీర్‌కు మద్దతుగా నిలిచిన నా కుటుంబం, స్నేహితులు, కోచ్‌లు, మా అభిమానులు, ఆడిన సహచరులు ప్రతి ఒక్కరికీ ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. ఇది అద్భుతమైన ప్రయాణం.”అని సౌథీ చెప్పాడు.
జట్టు ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్ కూడా న్యూజిలాండ్ క్రికెట్‌కు సౌథీ చేసిన సేవలను ప్రశంసించాడు. సౌథీ సామర్థ్యాన్ని, జట్టు పట్ల నిబద్ధతను స్టెడ్ హైలైట్ చేశాడు. "టిమ్ ప్రతిభ అత్యుత్తమంగా ఉన్నాయి" అని స్టెడ్ చెప్పాడు. "అతను చాలా టఫ్ కాంపిటేటర్, ప్రత్యేక సందర్భాల్లో జట్టును ఆదుకుంటాడు. అరుదుగా గాయపడతాడు. టీమ్ జట్టు, ప్రదర్శనపై చాలా శ్రద్ధ తీసుకుంటాడు. బ్లాక్‌క్యాప్స్ వాతావరణాన్ని మిస్ అవుతాడు. ఇప్పుడు కుటుంబంతో సమయం కేటాయించాల్సిన టైం ఇది. అతని ఆట తీర్పు, సాధించిన విజయాల ప్రభావం రాబోయే రోజుల్లో ఆటపై ఉంటుంది." అని గ్యారీ స్టెడ్ చెప్పాడు.
Also Read: సౌతాఫ్రికాతో జరిగే నాలుగో టీ20 మ్యాచ్‌కు టీమిండియాలో ఆడేదెవరు? జోహన్నెస్‌బర్గ్‌లో వాతావరణం ఎలా ఉంది?