PAK vs NZ 1st Test:  పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆఖరి రోజు న్యూజిలాండ్ విజయానికి 138 పరుగులు అవసరం కాగా.. వెలుతురు లేమితో అంపైర్లు ఆటను ముగించటంతో పాక్ ఊపిరి పీల్చుకుంది. ఈ మ్యాచ్ లో కివీస్ బౌలర్ ఇష్ సోధి 6 వికెట్లు తీశాడు. 


2 వికెట్లకు 77 పరుగులతో ఐదో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ 8 వికెట్లకు 311 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. పాక్ బ్యాటర్లలో ఇమాముల్ హక్ (96), సర్ఫరాజ్ అహ్మద్ (53), షకీల్ (55), వసీమ్ (43) పరుగులతో రాణించారు. పాక్ జట్టు న్యూజిలాండ్ ముందు 35 ఓవర్లలో 138 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. 


కివీస్ దూకుడు


లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ దూకుడుగా బ్యాటింగ్ చేసింది. ఓవర్ కు 8కి పైగా రన్ రేట్ తో పరుగులు సాధించింది. మైకెల్ బ్రాస్ వెల్ వికెట్ ను త్వరగానే కోల్పోయినా.. డెవాన్ కాన్వే (18), టామ్ లేథమ్ (35) పాక్ కు దడ పుట్టించారు. వీరిద్దరూ 7.3 ఓవర్లలోనే 61 పరుగులు జోడించారు. అదే ఊపులో మ్యాచ్ కొనసాగి ఉంటే విజయం కివీస్ సొంతమయ్యేదే. కానీ..


పాక్ కు కాపాడిన వెలుతురు లేమి


న్యూజిలాండ్ విజయం దిశగా పయనిస్తున్న సమయంలో వెలుతురు లేమితో అంపైర్లు ఆటను నిలిపివేశారు. దీంతో పాక్ ఓటమి నుంచి గట్టెక్కింది. మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇంకొన్ని ఓవర్ల మ్యాచ్ సాధ్యమైనా కివీస్ కు గెలుపు దక్కేదే. 


6 వికెట్లతో రాణించిన ఇష్ సోధి


ఈ మ్యాచ్ లో కివీస్ బౌలర్ ఇష్ సోధి 6 వికెట్లతో రాణించాడు. అతని టెస్ట్ కెరీర్ లో మొదటిసారి 6 వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్ లో అతను 86 పరుగులిచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు. 


తొలి ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ 438 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ 9 వికెట్లకు 612 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.