Pant Car Accident: కారు ప్రమాదంలో గాయపడిన టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. పంత్ త్వరగా కోలుకోవాలని మోదీ ట్వీట్ చేశారు.
ఘోర ప్రమాదం
ఉత్తరాఖండ్ రూర్కీలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అతను ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీ కొట్టిన ఘటనలో రిషబ్‌కు గాయాలయ్యాయి. ప్రస్తుతం పంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంలో అతను ప్రయాణిస్తున్న కారు పూర్తిగా దగ్ధమైంది.
దిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దిల్లీ, దెహ్రాదూన్ హైవేలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో కారు నుంచి పంత్ కిందకి దూకేసినట్టు పోలీసులు చెప్పారు. ఆయనే ఒంటరిగా డ్రైవ్ చేసుకొని వస్తున్న టైంలో ఈ దుర్ఘటన జరిగింది.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రూర్కీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేస్తూ పెను ప్రమాదం తప్పిందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గెట్‌వెల్ సూన్ ఛాంప్ అంటూ ట్వీట్ చేశారు.
బీసీసీఐ
రిషబ్ పంత్‌కు అత్యుత్తమ వైద్య సదుపాయాలు కల్పిస్తామని బీసీసీఐ తెలిపింది. అతడి నదురుపై రెండు చోట్ల గాట్లు పడ్డాయని, కుడి మోకాలిలో చీలిక వచ్చిందని పేర్కొంది. ప్రస్తుతానికి అతడి పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించింది.
Also Read: Rajnath Singh: 'పొరుగు దేశాలతో మంచి సంబంధాలు కావాలి- కానీ అలా కాదు'