Fast Charging Smartphone: ఇటీవలి కాలంలో మొబైల్ ఛార్జింగ్ స్పీడ్‌కు సంబంధించి చాలా ఆవిష్కరణలు జరుగుతున్నాయి. నేటి కాలంలో ఫోన్ ఎప్పుడూ మన చేతిలోనే ఉంటుంది. ప్రజలు తమ పనిని చాలా వరకు ఫోన్‌లోనే చేయడం ప్రారంభించారు. అతిగా వాడటం వల్ల బ్యాటరీ కూడా త్వరగా ఖర్చవుతుంది. అటువంటి పరిస్థితిలో ప్రజలు వేగంగా ఛార్జింగ్ అయ్యే లేదా మెరుగైన బ్యాటరీ బ్యాకప్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారు.


ఈ సంవత్సరం షావోమీ 120W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌ని పరిచయం చేసింది. ఇది ప్రవేశపెట్టిన వెంటనే, ఈ ఛార్జింగ్ టెక్నాలజీకి Oneplus, Realme పోటీని ఇచ్చాయి. ఈ రెండు కంపెనీలు తమ ఫోన్‌లను 150W ఛార్జింగ్ స్పీడ్‌తో విడుదల చేశాయి. ఇప్పుడు 150W ఛార్జింగ్ వేగం కూడా వెనుకబడింది. 240W ఛార్జింగ్ స్పీడ్‌తో ఫోన్‌ను తీసుకురావడానికి కొన్ని కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి.


240W ఛార్జింగ్ వేగంతో Oppo ఫోన్
Oppo త్వరలో 240W ఛార్జింగ్ స్పీడ్‌తో ఫోన్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుందని వార్తలు వస్తున్నాయి. Oppo గత సంవత్సరమే 240W ఛార్జింగ్ టెక్నాలజీని ప్రదర్శించింది. త్వరలో ఒక మొబైల్ తయారీదారు తన ఫోన్‌ను 240W ఛార్జింగ్‌తో లాంచ్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయినప్పటికీ ఆ నివేదికలో ఏ కంపెనీ పేరు అని స్పష్టంగా చెప్పలేదు.


Realme 240W ఛార్జింగ్ స్పీడ్ ఫోన్
240W ఛార్జింగ్ స్పీడ్‌తో ఫోన్‌ను తీసుకొచ్చే కొత్త కంపెనీ Realme అని కూడా వార్తలు వస్తున్నాయి. Realme త్వరలో లాంచ్ చేయనున్న రియల్ మీ జీటీ నియో 5కి 240W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.


240W ఛార్జింగ్‌తో ఫోన్ ఎంత వేగంగా ఛార్జ్ అవుతుంది?
నివేదిక ప్రకారం కొత్త 240W ఛార్జర్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వేగవంతమైన ఛార్జర్ కంటే 20 శాతం వేగంగా ఛార్జ్ చేస్తుంది. ఐకూ 10 ప్రో 200W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వచ్చింది. ఈ ఫోన్ 12 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు కొత్త ఛార్జర్ ఫోన్‌ను 0 నుంచి 100 శాతం వరకు 20 శాతం వేగంగా ఛార్జ్ చేయగలదు.