Rajnath Singh: భారత్ తన పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అయితే అందుకోసం జాతీయ భద్రతను పణంగా పెట్టలేమని రాజ్‌నాథ్ సింగ్ తేల్చిచెప్పారు. కేరళ తిరువనంతపురం.. శివగిరి మఠం 90వ వార్షిక కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్.. కీలక వ్యాఖ్యలు చేశారు.
మనం.. స్నేహితులను మార్చగలం కానీ మన పొరుగువారిని మార్చలేం" అని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ చేసిన వ్యాఖ్యలను మీకు గుర్తు చేస్తున్నాను. అందుకే, మన పొరుగు దేశాలతో మనకు మంచి, స్నేహపూర్వక సంబంధాలు అవసరం. అయితే మంచి సంబంధాలను కొనసాగించడానికి జాతీయ భద్రతలో రాజీపడం. మన దేశ భద్రతను పణంగా పెట్టి ఎవరితోనూ సత్సంబంధాలు కోరుకోం. - రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి
ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో సాయుధ దళాల సహాయంతో భారత సరిహద్దులను రక్షించడానికి మేము కృషి చేస్తున్నాం. అలానే మఠంలోని సాధువులు దేశ ఆత్మను రక్షించడానికి కృషి చేస్తున్నారు. మీరు చేస్తున్న పనిని నేను అభినందిస్తున్నాను. శరీరం, ఆత్మ రెండూ సురక్షితంగా ఉన్నప్పుడే మనం దేశంగా మనుగడ సాగించగలం. - రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి
Also Read: Vande Bharat Event: దీదీకి మరోసారి నిరసన సెగ- సభలో 'జై శ్రీరాం' నినాదాలు!