Pak vs ENG T20 WC 2022:  టీ20 ప్రపంచకప్ ను ఇంగ్లండ్ గెలవాలని కోరుకుంటున్నట్లు దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. అయితే టీ20 క్రికెట్ గురించి తెలిసినవాడిగా అదంత తేలిక కాదని వ్యాఖ్యానించాడు. ఈ విధంగా ఇంగ్లండ్ జట్టును పరోక్షంగా హెచ్చరించాడు. 


అలా కోరుకున్న జట్టే గెలుస్తుంది


టీ20 ప్రపంచకప్ లో ఫైనల్ విజేత ఎవరు అవుతారనే దానిపై సౌతాఫ్రికా దిగ్గజం డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  టీ20 వరల్డ్ కప్ ను ఇంగ్లండ్ గెలవాలని కోరుకుంటున్నా. అయితే అదంత తేలిక కాదని తెలుసు. టీ20 క్రికెట్ లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. గెలవాలని బలంగా అనుకున్న జట్టే ఇక్కడ విజయం సాధిస్తుంది. అదే ఈ ఆటలోని అద్భుతం అని అన్నాడీ 360 డిగ్రీ ప్లేయర్.


ఫైనల్ కు రెడీ


గతంలో పాక్, భారత్ టీ20 ప్రపంచకప్ ఫైనల్ కు చేరుకుంటాయని డివిలియర్స్ అంచనా వేశాడు. అయితే అతని అంచనా తప్పింది. సెమీఫైనల్ లో 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఈరోజు జరిగే ఫైనల్లో ఇంగ్లండ్- పాకిస్థాన్ తలపడుతున్నాయి. విజయం సాధించిన జట్లు ట్రోఫీని అందుకుంటుంది.


ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2022 ఆఖరి సమరానికి అంతా రెడీ! ఫైనల్‌ మ్యాచ్‌ టాస్‌ వేశారు. టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ వెంటనే బౌలింగ్‌ ఎంచుకున్నాడు. రెండు జట్లు మంచి ఫామ్‌తో ఫైనల్‌కు చేరుకున్నాయని పేర్కొన్నాడు. వాతావరణం చల్లగా ఉండటంతో ఫీల్డింగ్‌ తీసుకున్నామన్నాడు. ఎలాంటి మార్పులు చేయలేదని సెమీస్‌ జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని వెల్లడించాడు. టాస్‌ గెలిస్తే తామూ ఫీల్డింగే ఎంచుకొనేవాళ్లమని పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ అన్నాడు. మూమెంటమ్‌ను ఇలాగే కొనసాగిస్తామని పేర్కొన్నాడు. సెమీస్‌ జట్టుతోనే దిగుతున్నామని చెప్పాడు.


ఇంగ్లాండ్‌


 జోస్‌ బట్లర్‌, అలెక్స్‌ హేల్స్‌, ఫిలిప్‌ సాల్ట్‌, బెన్‌ స్టోక్స్‌, హ్యారీ బ్రూక్‌, లియామ్‌ లివింగ్‌స్టన్‌, మొయిన్‌ అలీ, సామ్‌ కరన్‌, క్రిస్‌ జోర్డాన్‌, క్రిస్‌ వోక్స్‌, ఆదిల్‌ రషీద్‌


పాకిస్థాన్‌


 మహ్మద్‌ రిజ్వాన్‌, బాబర్‌ ఆజామ్‌, మహ్మద్‌ హ్యారిస్‌, షాన్‌ మసూద్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌, షాదాబ్‌ ఖాన్‌, మహ్మద్‌ నవాజ్‌, మహ్మద్‌ వసీమ్‌ జూనియర్‌, నసీమ్‌ షా, హ్యారిస్‌ రౌఫ్‌, షాహిన్ అఫ్రిది