SL vs NZ 2nd T20: శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య సిరీస్‌లో రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొమ్మిది వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. అదే సమయంలో ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ఓటమి చవి చూడాల్సి వచ్చింది.
అయితే ఈ మ్యాచ్‌కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే వేసిన బంతికి శ్రీలంక బ్యాట్స్‌మెన్ పతుం నిశ్శంక బ్యాట్ విరిగిపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
స్పార్క్ స్పోర్ట్స్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి వీడియోను ట్వీట్ చేసింది. ఆడమ్ మిల్నే వేసిన వేగవంతమైన బంతికి పతుం నిశ్శంక బ్యాట్ విరిగిపోవడం ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా యూజర్స్ నిరంతరం కామెంట్లు చేస్తూ వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు ట్విట్టర్‌లో ఈ వీడియోను 22 వేల మందికి పైగా చూశారు. ఇది కాకుండా అభిమానులు వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు.
ఆడమ్ మిల్నే అద్భుతమైన బౌలింగ్
మరోవైపు ఈ మ్యాచ్ గురించి చెప్పాలంటే ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు 19 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో న్యూజిలాండ్ ముందు 142 పరుగుల విజయ లక్ష్యం ఉంది. ఆతిథ్య జట్టు కేవలం 14.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 146 పరుగులు చేసి విజయం సాధించింది.
ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించింది. తొలి టీ20లో ఆతిథ్య న్యూజిలాండ్‌ను సూపర్ ఓవర్‌లో శ్రీలంక ఓడించింది. అయితే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే అద్భుత బౌలింగ్‌ను ప్రదర్శించాడు. ఆడమ్ మిల్నే నాలుగు ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లను తీసుకున్నాడు. న్యూజిలాండ్ తరఫున ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ 43 బంతుల్లోనే అజేయంగా 79 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు బాదేయడం విశేషం.