ప్రపంచకప్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్‌పై ఉన్న సీమ్‌ను ఉపయోగించుకుని న్యూజిలాండ్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేయాలని పాక్ భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించి పాక్‌పై గెలవాలని కివీస్ చూస్తోంది. కివీస్ జట్టులో కేన్ విలియమ్సన్ తిరిగి జట్టులోకి వచ్చాడు.
ఏడు మ్యాచుల్లో నాలుగు విజయాలు, మూడు పరాజయాలతో కివీస్ నాలుగో స్థానంలో ఉండగా..అన్నే మ్యాచులు అడిన పాకిస్థాన్ మూడు విజయాలు, నాలుగు పరాజయాలతో అయిదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లు ఓడితే పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు పూర్తిగా అంతమవుతాయి. ఒకవేళ న్యూజిలాండ్ ఓడితే సెమీస్‌లో నాలుగో బెర్తు కోసం పోటీ మరింత రసవత్తరంగా మారుతుంది. మిగిలిన రెండు సెమీస్ బెర్తులు కీలకంగా మారిన వేళ ఏ జట్టు నిలుస్తుందో.. ఏ జట్టు ఆశలు ముగుస్తాయే ఈ మ్యాచ్‌తో కొంచెం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఈ ప్రపంచకప్‌లో సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ తప్పనిసరిగా గెలవాల్సిందే. ఈ మ్యాచ్‌తో పాటు ఇంగ్లండ్‌పై కూడా గెలిస్తేనే పాక్‌కు నాకౌట్ అవకాశాలు ఉంటాయి. లేకపోతే పాక్ వెనుదిరగక తప్పదు. బంగ్లాదేశ్‌పై ఎనిమిది వికెట్లతో విజయం సాధించిన పాక్ కివీస్‌పై కూడా ఘన విజయం సాధించి రన్‌రేట్ పెంచుకోవాలని చూస్తోంది. మూడు అర్ధ సెంచరీలు చేసినా కెప్టెన్ బాబర్ ఆజం నుంచి పాక్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. మహ్మద్ రిజ్వాన్, అబ్దుల్లా షఫీక్‌పై పాక్ జట్టు ఆశలు పెట్టుకుంది. గాయం నుంచి కోలుకుని బంగ్లాదేశ్‌పై 81 పరుగులు చేసిన ఓపెనర్ ఫఖర్ జమాన్‌పైనా పాక్ జట్టు గంపెడాశలతో ఉంది. షాహీన్ షా అఫ్రిది తన అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. మరో సీమర్ మహ్మద్ వాసిమ్ కూడా బంగ్లాదేశ్‌పై రాణించడంతో పాక్ ఊపిరి పీల్చుకుంది.
ఈ ప్రపంచకప్‌ను ఘనంగా ప్రారంభించిన కివీస్... వరుసగా మూడు ఓటములతో డీలా పడింది. టీమిండియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాపై వరుసగా మూడు పరాజయాలు కివీస్ సెమీస్ అవకాశాలను ప్రభావితం చేశాయి. ఏడు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసిన హెన్రీ దూరమవ్వడం కివీస్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. హెన్రీ స్థానంలో కైల్ జామీసన్‌ను తుది జట్టులోకి రానున్నాడు. విలియమ్సన్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. లాకీ ఫెర్గూసన్ గాయం కారణంగా దూరమయ్యాడు. న్యూజిలాండ్ బౌలింగ్‌లో ఆస్ట్రేలియా 388 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికాపై 357 పరుగులు చేసింది. ఈసారి బౌలింగ్‌లో రాణించాలని కివీస్ పట్టుదలగా ఉంది. చిన్నస్వామి స్టేడియం స్పిన్నర్లకు అనుకూలమన్న వార్తలతో శాంట్నర్ కూడా ప్రభావవంతమైన పాత్ర పోషించనున్నాడు. ట్రెంట్ బౌల్ట్, శాంట్నర్ రాణిస్తే పాక్‌కు తిప్పలు తప్పవు. రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ భారీ స్కోర్లు చేస్తే కివీస్‌కు ఎదురుండదు. ఈ టోర్నమెంట్‌లో రచిన్ రవీంద్ర ఏడు మ్యాచ్‌లలో 69.16 సగటుతో 415 పరుగులు చేశాడు. టామ్ లాథమ్, విల్ యంగ్ కూడా రాణిస్తే కివీస్‌కు తిరుగుండదు.
పాక్ గెలవాల్సిందే
న్యూజిలాండ్ ఫైనల్ 11:
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ
పాకిస్థాన్ ఫైనల్ 11: బాబర్ ఆజం (కెప్టెన్), ఫఖర్ జమాన్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, సల్మాన్ అలీ అఘా, హరీస్ రవూఫ్, హసన్ అలీ, షాహీన్ షా అఫ్రిది, మహ్మద్ వసీం.