Hardik-Natasha : ముంబై ఇండియన్స్ కెప్టెన్ , హార్డిక్ పాండ్యా(Hardic Pandya), బాలీవుడ్ నటి నటాషా(Natasa) దంపతులు విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నటాషా ఇన్‌స్టా ఖాతాలో పాండ్యా పేరును డిలిట్ చేయడం, అలాగే నటాషా బర్త్ డేకు పాండ్యా విష్ చేయకపోవడం, అంతే కాదు ఆమె ఐపీఎల్ మ్యాచ్ లకు రాకపోవడం ఈ వ్యాఖ్యలకు మరింత బలం చేకూరింది. 


అయితే హార్దిక్ పాండ్యాతో విడిపోతున్నట్టు వస్తున్న వార్తల నేపధ్యంలో  మోడల్ నటాషా స్టాంకోవిక్ తొలిసారి బయట కనిపించింది. శనివారం ఆమె స్నేహితుడు, బాలీవుడ్ నటి దిశా పటానీ బాయ్‌ఫ్రెండ్‌గా చెప్పుకొనే  అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్‌తో కలిసి ఓ కాఫీ షాప్కి వచ్చింది. బాలీవుడ్ నటి దిశాపటానీ బాయ్‌ఫ్రెండ్‌గా చెప్పే అలెగ్జాండర్ అలెక్సిలిక్‌తో మీడియా కంటబడిన నటాషా.. పాండ్యాతో విడాకుల వార్తలపై అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పకుండా నవ్వేసి ‘థ్యాంక్యూ’ అని వెళ్లిపోయింది.  విడాకుల వార్తలపై నటాషా వ్యతిరేకంగా స్పందించకుండా  ఇలా  నర్మగర్భ సమాధానం చెప్పడంతో  విడాకులపై క్లారిటీ వచ్చేసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.






 


2019 డిసెంబర్‌ 31న దుబాయ్‌లో  ఉత్సాహంగా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న జోడి.. ఆ తర్వాత తమ కుటుంబసభ్యుల సమక్షంలో రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు.  అదే ఏడాది జులైలో నటాషా  అగస్త్య పాండ్యాకు జన్మనిచ్చింది. అయితే  కొద్దిరోజుల క్రితం నటాషా.. ఇన్‌స్టా యూజర్‌నేమ్‌లో పాండ్యా అనే పదాన్ని డిలిట్ చేసింది.   అంతేకాదు ఒకప్పుడు సోషల్‌ మీడియా లో యాక్టివ్‌గా ఉండే వీరిద్దరూ ఈ మధ్య కలిసి ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకోలేదు. ఫిబ్రవరిలో లవర్స్ డే రోజు పాండ్య పోస్ట్‌ చేసిన ఫొటోనే  వీరిద్దరూ కలిసి ఉన్న పోస్ట్ లలో చివరిది. అంతే కాదు ఐపీఎల్‌ టోర్నీ జరుగుతున్న  సమయంలోనూ నటాషా స్టాండ్స్‌లో కనిపించకపోవడం వారి విడాకుల ఊహాగానాలకు  మరింత బలం చేకూరింది. అలాగే మార్చి 4న నటాషాపుట్టిన రోజునాడు  పాండ్య విష్‌ చేయలేదు. దీంతో  ఇరువురి ఫాలోవర్స్ వీరిద్దరూ విడిపోతున్నారంటూ  నమ్మకంగా చెబుతున్నారు. కానీ ఇప్పటివరకూ పాండ్యా, నటాషాలనుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఈ రోజు జరిగిన సంఘటన వీరి విడాకుల వార్తలకు బలం చేకూర్చింది. 


మరోవైపు టీ 20 మ్యాచ్ కోసం ఒక టీం అంతా అమెరికా ప్రయాణం అవ్వగా పాండ్య మాత్రం లండన్ చేరుకున్నాడు. అలాగే పాండ్య తన మొత్తం ఆస్తులలో నటాషాకు 70 శాతం ఇవ్వాల్సి వస్తుందన్న వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తన ఆస్తిలో దాదాపు 50 శాతానికి పైగా తన అమ్మ పేరుతో ఉందని. అలా ఉంచితే భవిష్యత్తులో    ఏమైనా వివాదాలు జరిగితే ఆస్తి కోల్పోకుండా ఉండటానికి ఇలా చేశానని  ఒకప్పుడు  హార్దిక్ స్వయంగా  చెప్పిన వీడియో కూడా ఇప్పుడు మరోసారి  బయటకు వచ్చింది. మొత్తానికి ఐపిఎల్ లో రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ జట్టు పగ్గాలు అందుకున్న క్షణం నుంచి ఇప్పటి ఈ విడాకుల వరకు హార్దిక్ అన్నిరకాలుగాను నష్టపోయినట్టే కనిపిస్తున్నాడు.