Cyclone Remal Effect In Slight Rain Today In Chennai: ఆదివారం చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరగనున్న  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 ఫైనల్‌కు  వర్షం ముప్పు కాస్త తక్కువగానే ఉంది. ప్రస్తుతానికి ఆకాశం మేఘాలతో ఉన్నా మ్యాచ్ జరిగే సమయంలో వర్షం కురిసే అవకాశం కాస్త  ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఒకవేళ మ్యాచ్ లో వాన పడితే అదనంగా 120 నిమిషాలు అంటే 2 గంటలు సమయం ఇస్తారు. అయినా వర్షం తగ్గకపోతే  రిజర్వ్ డే నాడు మ్యాచ్ జరుగుతుంది.  ఒకవేళ  రెమాల్ తుఫాను ఎఫెక్ట్ వల్ల రెండు రోజులూ వర్షం పడితే పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్ గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ విజేతగా ప్రకటిస్తారు. 


ఇక భారత వాతావరణ విభాగం (IMD)  వివరాల ప్రకారం..  తమిళనాడు రాష్ట్రం మొత్తానికి అక్కడక్కడా తేలికపాటి, లేదా ఒక  మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొనింది. అయితే  గంటకు 30 నుంచి 40 కిలో మీటర్లు వేగంతో గాలి వీచే అవకాశం ఉందని చెప్పారు. అయితే తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో మాత్రం  భారీ వర్షాలు కూడా కురిసే  ఉంది. ఇక, ఇవాళ చెన్నైలో చెపాక్ చుట్టూ మేఘాలు కమ్మేస్తాయని ఐఎండీ తెలిపింది. ఆ మేఘాలు కూడా రాత్రి 12 తర్వాత మాత్రమే  పోతాయని చెప్పుకొచ్చింది. ఇక  Weather.com ప్రకారం, మే 26న మధ్యాహ్నం నుండి రాత్రి వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. భారతీయ కాలమానం ప్రకారం   రాత్రి 7:30 గంటలకు టైటిల్ మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి ఉష్ణోగ్రత దాదాపు 24-25 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవచ్చని అంచనా.  దీంతో  IPL 2024 ఫైనల్ మ్యాచ్‌లో వర్షం పడే అవకాశం కేవలం మూడు శాతం మాత్రమే. అయితే, తేమ 66 నుండి 73 శాతం మధ్య ఉంటుందని అంచనా. అలాగే  మంచు కురిస్తే, రెండవ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ కొంచెం సవాలుగా ఉంటుంది. ఒకవేళ వర్షం పడితే, ఆదివారం కనీసం 12:26 AM వరకు ఐదు ఓవర్ల మ్యాచ్ జరగచ్చు. ఒకవేళ ఫైనల్‌ను ఆదివారం, మే 26న పూర్తి చేయలేకపోతే, అది రిజర్వ్ డే, మే 27, సోమవారం, ఆపివేసిన చోట నుండి తిరిగి ప్రారంభమవుతుంది. అదనంగా, రిజర్వ్ డే రోజున IPL 2024 ఫైనల్ కోసం 120 నిమిషాల ప్రత్యేక సదుపాయం ఉంటుంది. వర్షం కారణంగా ఆదివారం ఐదు ఓవర్ల మ్యాచ్ సాధ్యం కాకపోయినా, రిజర్వ్ డే, మే 27 నాడు మళ్లీ కొత్తగా  టాస్ నుంచి మొదలు పెడతారు.