IPL 2024 Closing Ceremony :  ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న IPL 2024 టైటిల్ మ్యాచ్  ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్ , సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య  చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో  జరుగనుంది. ప్రతిష్టాత్మక ఈ మ్యాచ్‌కు ముందు ముగింపు వేడుకలను  ఏర్పాటు చేశారు.  ఇందులో అమెరికన్ బ్యాండ్   'ఇమాజిన్ డ్రాగన్స్' ప్రదర్శన నిర్వహించనున్నారు. అంతేకాదు అద్భుతమైన విద్యుత్ దీప కాంతులతో స్టేడియంను సుందరంగా తీర్చిదిద్దారు. ఈ విషయాన్ని బ్యాండ్ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అద్భుతమైన వీడియో  ద్వారా అభిమానులతో పంచుకుంది. బ్యాండ్ మెయిన్ సింగర్  డాన్ రేనాల్డ్స్ ఒక స్టార్ స్పోర్ట్స్ వీడియోలో తాను  IPL 2024 ముగింపు వేడుకకు హాజరవుతానని స్వయంగా చెప్పాడు. విరాట కోహ్లీతో ప్రారంభం అయ్యే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 






 


IPL 2024 ముగింపు వేడుక ఎక్కడ ?


ఐపీఎల్ ఫైనల్స్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్నాయి.


ముగింపు వేడుక  ప్రారంభ సమయం?


ఐపీఎల్ ముగింపు వేడుక సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది.


వేడుక ఎవరు నిర్వహిస్తారు?


ఫైనల్ మ్యాచ్‌కు ముందు అమెరికన్ రాక్ బ్యాండ్ "ఇమాజిన్ డ్రాగన్స్" ప్రత్యేక కచేరీని ప్రదర్శిస్తుంది.


ఎవరీ "ఇమాజిన్ డ్రాగన్‌" ?


"ఇమాజిన్ డ్రాగన్స్" ప్రపంచ ప్రసిద్ధ రాక్ బ్యాండ్.  ప్రఖ్యాతి పొందిన బిలీవర్  సాంగ్ ను ఈ  ఇమాజిన్ డ్రాగన్స్ పాడారు. ఇప్పుడు ఇదే టీం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్రత్యేక  ప్రదర్శన ఇవ్వనుంది.


ముగింపు వేడుకలో ఇంకా ఏముంది? 


మ్యూజిక్ షోతో పాటూ ఈ వేడుకలో లేజర్ షో,  మరి కొన్ని ప్రదర్శనలకు కూడా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.  


ఫైనల్ మ్యాచ్ ఎన్నింటికి  ప్రారంభమవుతుంది?


కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌లో టాస్ రాత్రి 7 గంటలకు జరుగుతుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.


KKR  Vs  SRH గతంలో ఏం జరిగింది ?


కోలకతా, హైదరాబాద్‌ జట్లు ఇప్పటి వరకు 27 సార్లు తలపడగా, కొలకత్తా  జట్టు 18 సార్లు గెలుపొందగా,  హైదరాబాద  జట్టు 9 సార్లు మాత్రమే గెలిచింది. ముఖ్యంగా కోల్ కతా నైట్ రైడర్స్ ఈసారి ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ విజయం సాధించింది.