KKR vs SRH IPL 2024 Final: ఐపీఎల్(IPL)-17 అంతిమ సమరానికి సమయం ఆసన్నమైంది. చెన్నై వేదికగా జరగనున్న ఫైనల్‌లో కోలకతా(KKR), హైదరాబాద్‌(SRH) జట్లు తలపడనున్నాయి. లీగ్‌ దశను అగ్రస్థానంతో ముగించిన కోల్‌కతా హ్యాట్రీక్‌ కప్పుపై కన్నేసింది. ఈ సీజన్‌లో విధ్వంసక బ్యాటింగ్‌ సరికొత్త రైజర్స్‌ చూపించిన హైదరాబాద్‌ రెండో కప్పును అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. బలాబలాల్లో సమవుజ్జీల్లా కనిపిస్తున్న రెండు జట్ల మధ్య చెపాక్‌లో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. 


అన్ని విభాగాల్లో పటిష్టంగా 

సన్‌రైజర్స్‌కు హైదరాబాద్‌ మరోసారి బ్యాటింగ్‌ బలాన్నే నమ్ముకుంది. కప్పును ముద్దాడాలంటే ఈ  సీజన్‌లో అదిరే బ్యాటింగ్‌తో అదరగొట్టిన హెడ్‌, అభిషేక్‌ శర్మ, క్లాసన్‌లు మరోసారి రాణించాల్సిన అవసరం ఉంది. ఓపెనింగ్‌ జోడి శుభారంభంపైనే రైజర్స్‌ విజయావకాశాలు ఆధారపడిఉన్నాయి. ఎలిమినేటర్‌లో రాణించిన రాహుల్‌ త్రిపాఠి, క్లాసన్‌లో ఫైనల్‌లో ఏమేరకు రాణిస్తారో చూడాలి.తెలుగు కుర్రాడు నితీశ్‌ కుమార్‌, ఐడెన్‌ మార్‌క్రమ్, అబ్దుల్‌ సమద్‌ సత్తాచాటాలి. ఎలిమినేటర్‌లో చెలరేగిన . బౌలర్లు తుదిపోరులో రాణించాల్సిన అవసరం ఉంది. నటరాజన్‌, భువనేశ్వర్‌, కెప్టెన్‌ కమిన్స్‌లతో బౌలింగ్‌ విభాగం పటిష్టంగా ఉంది. ఎలిమినేటర్‌లో స్పిన్‌తో చెలరేగిన ఆల్‌రౌండర్‌ షాబాజ్‌ అహ్మద్‌... మరోసారి రాణించాలి. అటు కోలకతా సాల్ట్‌ దూరం కావడంతో బ్యాటింగ్‌ కొంత బలహీనపడినా.. నరైన్, శ్రేయస్, వెంకటేశ్‌ అయ్యర్, రసెల్, రింకులతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగా కనిపిస్తోంది. పేసర్లు స్టార్క్, హర్షిత్‌ రాణా, వైభవ్‌ అరోరా మంచి ఫామ్‌లో ఉన్నారు. స్పిన్‌ పిచ్‌ అయిన చెపాక్‌లో  స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌లు అడ్డుకోవడం ప్రత్యర్థి జట్టుకు కష్టమనే చెప్పాలి. ఆఖరు పోరులో తుదిజట్టులో పెద్దగా మార్పులు లేకుండానే బరిలోదిగే అవకాశం ఉంది. ఐపీఎల్‌-17 ఫైనల్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. అయితే మ్యాచ్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం అయితే లేదు. ఒకవేళ అలా జరిగినా సోమవారం రిజర్వ్‌ డే ఉంది కాబట్టి ఇబ్బంది లేదు.

 

గంభీర్‌ వ్యూహమా.. కమిన్స్‌ ప్రణాళికా..

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను సారధి పాట్ కమిన్స్ ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కోల్‌కత్తా వ్యూహకర్త గౌతమ్ గంభీర్ హైదరాబాద్‌కు చెక్ పెట్టేందుకు పక్కా వ్యూహాలు సిద్ధం చేశాడు. మైదానం వెలుపల అన్నీ తానై వ్యవహరిస్తున్న గంభీర్‌ పైనల‌్ కోసం ఏం ప్రణాళిక రచిస్తున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. కెప్టెన్‌గా తన రెండో ఫైనల్‌ ఆడుతున్న  కోల్‌కత్తా కెప్టెన్‌ శ్రేయస్ అయ్యర్... గంభీర్‌ వ్యూహాల ముందు తేలిపోయాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. కమ్మిన్స్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా ఆరు నెలల వ్యవధిలో వన్డే ప్రపంచ కప్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్, యాషెస్‌ సిరీస్‌లను గెలిచింది. ఇప్పుడు ఈ కప్పును కూడా సాధించేస్తే కమిన్స్‌ ఖాతాలో మరో అరుదైన ఘనత చేరుతుంది.

 

 జట్లు

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ , ఐడెన్ మార్క్‌రామ్, అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, అన్మోల్‌ప్రీత్ సింగ్ .

  కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), కెఎస్ భరత్, రహ్మానుల్లా గుర్బాజ్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, అనుకుల్ రాయ్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, వరుణ్ చక్రవర్తి, వరుణ్ చక్రవర్తి అరోరా, చేతన్ సకారియా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్.