SRH vs KKR Final Match: క్రికెట్ అంటే మనకున్న క్రేజ్ అంతా ఇంత కాదు.. దీంతోపాటు మన ఇండియన్స్ కి ప్రత్యేకంగా ఆడ్ అయ్యేవి సెంటిమెంట్స్ కూడా.. ప్రతి మ్యాచ్ ని మనం సెంటిమెంట్అనే కోణంలో కూడా చూస్తాం.. ఇప్పటికీ ఎంతోమంది నేను గతంలో ఈ టి షర్ట్ వేసుకున్నప్పుడు కప్పు కొట్టాం కాబట్టి, ప్రతి ఫైనల్స్ కి అదే టిషర్టు వేసుకునేవాళ్ళు ఉన్నారు అంటే ఆశ్చర్యమేమీ కాదు. అలాంటివి ఇప్పుడు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు సంబంధించిన రెండు సెంటిమెంట్లు బయటకు వచ్చాయి.. అదే గనుక నిజమైతే కప్పు హైదరాబాద్ దే..
ఈ హెడ్ మాస్టర్ లెక్కలు మార్చేయగలడు..
గతేడాది అంటే 2023లో టీమిండియా లో రెండు భారీ టోర్నీలలో చివరి మెట్టు మీద చతికిలపడింది. ఫైనల్ లో ఇంటి బయట పట్టింది. అందులో ఒకటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, రెండవది . లార్డ్స్ లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ టెస్ట్ మ్యాచ్. ఈ రెండు మ్యాచ్లలోనూ లో భారత్ కు కొరకరాని కొయ్యగా మారి ఆసీస్ ను గెలిపించింది ట్రావీస్ హెడ్(Travis Head). ఫస్ట్ ఇన్నింగ్స్ లో హెడ్ బాదిన 163పరుగులు ఆసీస్ కు అద్భుతమైన స్థాయిలో ఆధిక్యం ఇవ్వటం మే కాదు టీం ఇండియా ను ఓడించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ను ఆస్ట్రేలియా గెలుచుకోవటంలో కీలకపాత్ర పోషించాడు. అంతే కాదు అద్భుతమైన తన ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గానూ నిలిచాడు.
మరోసారి నవంబర్ లో ఐసిసి వన్డే వరల్డ్ కప్. ఇక్కడ కూడా ఫైనల్లో భారత్ కు ఎదురుపడింది ఆస్ట్రేలియా. నిక్కీ, నీలిగీ భారత్ 240పరుగులు చేస్తే.. అక్కడ కూడా హేడే మనోళ్ళకు హెడేక్ తెప్పించాడు. ఓపెనర్ గా బరిలో దిగీ దిగటంతోనే ఏకంగా 137పరుగులు చేయటంతో ఆస్ట్రేలియా ఆరువికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వరల్డ్ కప్ ఎంచక్కా లాక్కెళ్లిపోయింది. అప్పుడు కూడా ఈ హెడ్ మాస్టారే మళ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఆ అరివీర భయంకరుడు ఇప్పుడు మూడోసారి భారీ టోర్నీలో ఫైనల్ ఆడుతున్నాడు. అయితే ఆడుతున్నది మన తెలుగోళ్ళ తరపున. ఆ రెండు టోర్నీలను ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో హెడ్ ఇరగదీశాడు. ఇప్పుడు కూడా అదే కెప్టెన్ నేతృత్వంలో సన్ రైజర్స్ ను ఫైనల్ కి చేర్చాడు . ఏదో ఒకసారి, రెండుసార్లు నీరుత్సాహపరచినా తరువాత మళ్ళీ గాదిలి పడాడు. హెడ్ మాస్టర్ అనే నిక్ నేమ్ తో ఓపెనర్ గా పవర్ ప్లేల్లో పరుగులతో ఇరగదీస్తూ ఆరెంజ్ ఆర్మీ విజయాల్లో ముఖ్యమైనవాడిగా మారాడు. 14 మ్యాచుల్లో 567 పరుగులు చేసిన హెడ్..అభిషేక్ శర్మ తోడుగా చేస్తున్న విధ్వంసమే సన్ రైజర్స్ కి అపూర్వ విజయాలను సాధించి పెట్టింది. ఇప్పటికే నాలుగు అర్ధ సెంచరీలు ఓ సెంచరీతో మంచి ఫాంలో ఉన్న హెడ్ మరొక్కసారి ఎప్పటిలాగే అచ్చొచ్చే ఫైనల్ లో చెలరేగిపోతే ఇంకేముంది కోల్ కతా బౌలర్లు బెంబేలెత్తిపోవటం ఖాయం. అదే ధైర్యంతో ఉన్నారు సన్ రైజర్స్ ఫ్యాన్స్. ఏం పర్లేదు మావాడు చూసుకుంటాడు అంటున్నారు.
కమిన్స్ కప్పుతో ఫోజ్ ఇచ్చాడంటే కొట్టేస్తాయడంతే ...
ఐపిఎల్ ఫైనల్ కి ముందు కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తో కలిసి సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్(Pat Cummins) ఫోటో సెషన్ చేశారు. సాధారణంగా ప్రతీ పెద్ద క్రికెట్ ఈవెంట్ ఫైనల్ కి ముందు ఇలా కెప్టెన్లను ట్రోఫీలతో ఫోటో షూట్స్ చేయటం గత కొంతకాలంగా జరుగుతున్నదే. అదేంటో గడచిన ఏడాది కాలంలో ఇలా పెద్ద ఈవెంట్ లో ఫోటో షూట్ చేసిన ప్రతీసారి ప్యాట్ కమిన్సే గెలిచాడు, తన ఆస్ట్రేలియాటీంను గెలిపించాడు. తాజాగా మెరీనా తీరంలో పడవలపై కూర్చుని ఐపీఎల్ ట్రోఫీని ఇరు జట్ల కెప్టెన్లు ప్రదర్శించారు. చెన్నై కామన్ మెన్ ను రెప్రసెంట్ చేసేలా ఫోటోలకు పోజ్ ఇచ్చారు. గతంలో రెండు సార్లు ఫోటో షూట్స్ లోనూ కనపడి, తరువాత రెండు సార్లు కప్పు మన చేతికి రాకుండా చేసిన పాట్ కమిన్సే ఈ సారి కూడా గెలిచి సన్ రైజర్స్ కి ఐపీఎల్ ట్రోఫీ అందించాలని ప్రతీ ఆరెంజ్ ఆర్మీ ఫ్యానూ కోరుకుంటున్నాడు, అదే జరుగుతుందని నమ్ముతున్నాడు కూడా.