Jadeja - Dhawan: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి శిఖర్ ధావన్ డాన్స్ చేస్తున్న  వీడియా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇందులో జడేజా హాస్పిటల్ బెడ్ మీద ఉంటే.. అతని పక్కన ధావన్ డాన్స్ చేస్తూ ఉంటాడు. దీనికి సంబంధించిన వీడియోను ధావన్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. క్షణాల్లోనే అది వైరల్ గా మారింది. 


ఆసియా కప్ సందర్భంగా గాయపడిన జడేజా మోకాలికి శస్త్రచికిత్స తీసుకుని కోలుకుంటున్నాడు. తన సర్జరీకి సంబధించిన ఫొటోలను తరచూ అభిమానులతో పంచుకుంటున్నాడు. అతను కోలుకోవడానికి కనీసం 5 నుంచి 7 వారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే స్వదేశంలో ఆసీస్, దక్షిణాఫ్రికాలతో సిరీస్ లతో పాటు టీ20 ప్రపంచకప్ కు జడేజా దూరమయ్యాడు. 


ఈ క్రమంలోనే జడేజాను చూడడానికి ఆసుపత్రికి వెళ్లిన ధావన్ అక్కడ రీల్ చేశాడు. బ్యాక్ గ్రౌండ్ లో ఇతనికి తర్వగా పెళ్లిచేయండి. బాగుపడతాడు అనే అర్ధం వచ్చేలా ఉన్న హిందీ డైలాగ్ వస్తుండగా ధావన్ స్టెప్పులు వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది. 


ప్రస్తుతం భారత్ ఆడుతున్న టీ20 సిరీస్ లకు సీనియర్ బ్యాటర్ అయిన శిఖర్ ధావన్ ఎంపికవలేదు. అయితే వన్డేల్లో అతను జట్టులో కొనసాగుతున్నాడు. పొట్టి సిరీస్ తర్వాత అక్టోబరులో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ కు ధావన్ కెప్టెన్ గా ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న టీమిండియా జట్టు టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లనున్న నేపథ్యంలో.. ప్రోటీస్ తో వన్డే సిరీస్ కు కుర్రాళ్లు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. యువకులతో కూడిన జట్టును ధావన్ నడిపించనున్నాడు. 


దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ షెడ్యూల్


అక్టోబర్ 6- తొలి వన్డే


అక్టోబర్ 9- రెండో వన్డే


అక్టోబర్ 11- మూడో వన్డే