Duleep Trophy highlights టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్ దులీప్ ట్రోఫీలో తన బ్యాట్‌తో అదరగొడుతున్నాడు. అనంతపురం క్రికెట్ మైదానంలో జరుగుతున్న దులీప్ ట్రొఫీ మ్యాచ్‌లో ఇండియా బీ టీం టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇండియా సి జట్టు తరఫున ఆడుతున్న భారత వికెట్ కీపర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ నమోదు చేశాడు. సెకండ్ డౌన్లోడ్ వచ్చిన ఇషాన్ కిషన్ 126 బంతుల్లో 14 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సహాయంతో 111 పరుగులు చేసి సెంచరీ సాధించాడు.
బిసిసిఐ ఆదేశాలను పాటించకుండా వేటుకు గురైన ఈ యువ భారత వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ భారత జట్టులో చోటు సంపాదించుకునేందుకు అంది వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు.
తమిళనాడులో నిర్వహించిన బుచ్చిబాబు క్రికెట్ టోర్నీలో కూడా ఇషాన్ కిషన్ తన బ్యాట్‌తో అద్భుత ప్రదర్శనను కనబరిచాడు. ఇప్పటి నుంచి జరిగే దేశవాళి క్రికెట్‌కు అందుబాటులో ఉండేలాగా ఇషాన్ కిషన్ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.
అర్థ సెంచరీతో రాణించిన ఇంద్రజిత్తు :
ఇంద్రజిత్తు తన సొగసైన బ్యాటింగ్‌తో ఈశాన్ కిషన్‌కు సహకరిస్తూనే తన అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 136 బంతుల్లో 9 ఫోర్లు సహాయం తో 78 పరుగులు చేసి రాహుల్ బౌలింగ్‌లో దీపక్ చాహర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఇషాన్ కిషన్ సెంచరీ, ఇంద్రజిత్తు అట్ట సెంచరీలతో దీంతో ఇండియా సీ జట్టు భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. ఇండియా సి జట్టు ప్రస్తుతం 375/5 పటిష్ట స్థితిలో నిలిచింది.
మరో మ్యాచ్‌లో సామ్స్ ములాని, తనుష్ కోటియన్ అర్థ సెంచరీలతో అదరగొట్టారు. అనంతపురం ఏ మైదానంలో ఇండియా ఏ టీం ఇండియా డి టెన్ మధ్య పోటీ రసవత్వంగా కొనసాగింది. తొలుత ఇండియా డీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదటి రోజు పేసర్లకు స్వర్గధామమైన పిచ్చిపై ఇండియా డి టీం బ్యాట్స్‌మెన్ వరుసగా వికెట్లు సమర్పించుకుంటూ పెవిలియన్ బాట పట్టారు. ఈ క్రమంలో క్రీజ్‌లోకి వచ్చిన సామ్స్ ములాని, తనుష్ కోటియన్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరిద్దరూ కలిసి ఇండియా డి టీం బౌలర్లకు మరో అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు.
సామ్స్ ములానీ 88(8 ఫోర్లు, 3 సిక్స్‌లు), తనుష్ కొటియన్(6 ఫోర్లు, ఒక సిక్సర్)లు అర్ధసెంచరీలో జట్టుని ఆదుకున్నారు. హర్షదీప్ వేసిన అద్భుతమైన బాల్ కు తనుష్ కొటియన్ సౌరబ్ కుమార్ కు క్యాచ్ ఇచ్చి 53 పరుగుల వద్ద వెనుతిరిగాడు. మరో ఎండులో సామ్స్ మూలని 88 పరుగులతో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం 288/8 ఇండియా సి జట్టు కొనసాగుతోంది.
Also Read: దులీప్ ట్రోఫీ టెస్టు మ్యాచ్ ఫస్ట్ డే హైలైట్స్- ఇషాన్ సెంచరీతో భారీ స్కోర్ దిశగా ఇండియా సీ జట్టు