Duleep Trophy highlights, 2nd Round Day 1: దులీప్‌ ట్రోఫీలో భాగంగా రెండో మైదానంలో జరిగిన ఇండియా బీ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా– సీ జట్టు బ్యాట్స్మెన్ ఇషాన్‌ కిషన్‌ సెంచరీతో కదంతొక్కాడు. దీని ఫలితంగా ఇండియా సీ జట్టు భారీ స్కోర్‌ దిశగా పయనిస్తోంది. మరో మ్యాచ్‌లో ఇండియా ఏ, డీ జట్లు పోటీ పడ్డాయి. ఇండియా ఏ జట్టులో సామ్స్‌ ములానీ, తనుష్‌ అర్ధసెంచరీలు సాధించగా ఏ జట్టు గౌరవప్రదమైన స్కోర్‌ చేసింది. అనంతపురం ఆర్డీటీ స్పోర్ట్స్‌ సెంటర్‌లో ఉన్న రెండు మైదానాల్లో రెండో రౌండ్‌ మ్యాచ్‌ ఇండియా– ఏ, డీ మధ్య, ఇండియా బీ, సీ జట్ల మధ్య నాలుగు రోజుల క్రికెట్‌ మ్యాచ్‌ మొదలయ్యాయి. 


Also Read: ఈ జట్టును చూస్తే వణికిపోవాల్సిందే, అందరూ పోటుగాళ్లే


ఇండియా సీ 375/5: 
టాస్‌ నెగ్గిన ఇండియా బీ జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. భారత జట్టు వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ ఇండియాబీతో జరిగిన మ్యాచ్‌లో మెరిశాడు. రెండో డౌన్‌లో వచ్చిన ఇషాన్‌ కిషన్‌ 126 బంతుల్లో 14 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సహాయంతో 111 సెంచరీతో అదరగొట్టాడు. ఇతనికి తోడుగా బాబా ఇంద్రజిత్‌ 136 బంతుల్లో 9 బౌండరీల సహాయంతో 78 పరుగులు చేశాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ 46, సాయిసుదర్శన్‌ 43, రజత్‌ పటిదార్‌ 40 పరుగులు చేశారు. ఆటముగిసే సమయానికి ఇండియా సీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 79 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 375 పరుగులు చేసింది. ఇండియా బీ జట్టు బౌలర్లలో ముకేష్‌కుమార్‌ 3, నవదీప్‌ శైనీ, రాహుల్‌ చాహర్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు. 


ఇండియా ఏ జట్టు 288/8: 
మరో మ్యాచ్‌లో ఇండియా ఏ, డీ జట్లు పోటీ పడ్డాయి. టాస్‌ నెగ్గిన ఇండియా డీ జట్టు ఫీల్గింగ్‌ ఎంచుకుంది. ఇండియా ఏ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆటముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. జట్టులో సామ్స్‌ ములానీ 88(8 ఫోర్లు, 3 సిక్స్‌లు), తనుష్‌ కొటియన్‌(6 ఫోర్లు, ఒక సిక్సర్‌)లు అర్ధసెంచరీలో ఆకట్టుకున్నారు. ఐపీఎల్‌ స్టార్‌ ప్లేయర్‌ రియాన్‌ పరాగ్‌ 29 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌ సహాయంతో 37 పరుగులు చేశారు. ఇండియా డీ బౌర్లలో హర్షిత్‌ రాణా, కవిరప్ప, అర్ష్‌దీప్‌ సింగ్‌ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.


Also Read: 2023లో దేశానికి కప్పు రాలేదు, కానీ రూ.వేల కోట్లు వచ్చి పడ్డాయా?