Sports News: 2023 ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్‌ ఆస్ట్రేలియా చేతిలో ఓడి చివరి స్టేజ్‌ మీద బోల్తాపడి కోట్లాది మంది అభిమానులకు నిరాశకు గురిచేసిన విషయం తెలిసిందే. 2023 వరల్డ్ కప్‌ రోహిత్ సేనకు కలిసి రానప్పటికీ భారత్‌కు మాత్రం ఆర్థికంగా బాగా కలిసి వచ్చిందని ఐసీసీ విడుదల చేసిన నివేదిక చెబుతోంది. బీసీసీఐ సహా ఐసీసీ పెట్టుబడులు నేరుగా వివిధ సెక్షన్లలోని అనేక మంది వ్యాపారులకు భారీ ఆదాయాన్ని తీసుకొచ్చినట్లు తేలింది.


ఈ వరల్డ్ కప్‌ మ్యాచ్‌లను నేరుగా ఎంతమంది వీక్షించారంటే:


చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత్ ఆతిథ్యమిచ్చిన గత వన్డే ప్రపంచకప్‌లో కోటీ పాతిక లక్షల మంది నేరుగా స్టేడియాలకు వెళ్లి మ్యాచ్‌లను తిలకించారని ICC విడుదల చేసిన నివేదిక పేర్కొంది. వీరిలో 50 శాతం మంది మొదటి సారి క్రికెట్ స్టేడియాలకు వచ్చిన వారు కాగా.. మరో 19 శాతం మంది ఈ టోర్నమెంట్‌ కోసం మొదటి సారి భారత్‌ను విజిట్ చేసినట్లు ఐసీసీ చెప్పింది. ఈ కారణంతో టూరిజం రంగంలో ఉన్న వారు ఆర్థికంగా లాభపడడానికి హెల్ప్ చేసినట్లు తెలిపింది. పాన్‌ ఇండియా వ్యాప్తంగా భారతీయుల నుంచి 253 మిలియన్ డాలర్ల మేర టూరిజం ద్వారా రాగా..  విదేశీయుల నుంచి టూరిజం రూపంలో 281.9 మిలియన్‌ డాలర్లు భారత ఆర్థిక వ్యవస్థలోకి వచ్చినట్లు తెలిపింది.


 ఐసీసీ కానీ లేదా బీసీసీఐ సంయుక్తంగా పెట్టిన పెట్టుబడులతో దేశ ఆర్థిక వ్యవస్థలోకి 11 వేల 637 కోట్లు వచ్చినట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తెలిపింది. క్రికెట్ స్టేడియాల అభివృద్ధికి ఐసీసీ లేదా బీసీసీఐ నేరుగా క్రికెట్‌ అసోసియేషన్లకు నిధులు కేటాయించాయి. ఆ నిధులు వివిధ మార్గాల్లో వివిధ సెక్షన్ల వ్యాపారుల వ్యాపారానికి ఊతం ఇచ్చినట్లు ఐసీసీ వెల్లడించింది. 2023 అక్టోబర్‌, నవంబర్ నెలల్లో ఈ టోర్నమెంట్ జరగ్గా.. దేశవ్యాప్తంగా 10 వెన్యూలలో మ్యాచ్‌లు నిర్వహించారు. అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కత, హైదరాబాద్‌, ముంబై నగరాల్లో హాస్పిటాలిటీ, ఇన్‌ఫ్రాస్ట్రర్‌, ట్రాన్స్‌పోర్టేషన్ రంగాల్లో వ్యాపారులు బాగా లాభాలు గడించినట్లు ఐసీసీ పేర్కొంది.


క్రీడా రంగంతో పాటు టూరిజం, ఆతిథ్య రంగంలో నేరుగా లేదా ఇండైరెక్ట్‌ మోడ్‌లో దాదాపు 48 వేల కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయని ఐసీసీ వివరించింది. ఒక్క ఆతిథ్య రంగంలోనే 18 మిలియన్ డాలర్లు భారత ఎకానమీలోకి వచ్చిపడ్డాయి. మీడియా బ్రాండింగ్ కవరేజ్‌, సిటీ షాట్స్‌ ద్వారా 70.7 మిలియన్ డాలర్లు వచ్చాయని.. అకామడేష్‌, ఫుడ్‌, ట్రావెల్‌, బెవరేజెస్‌ ద్వారా మరో 861 మిలియన్ డాలర్లు భారత ఆర్థిక వ్యవస్థలోకి వచ్చాయని ఐసీసీ వెల్లడించింది.


ఈ వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరిన భారత్.. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్‌లో ఆస్ట్రేలియాకు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేక చతికిల పడింది. ఈ టోర్నమెంట్‌లో సెమీస్‌లో ఆప్గనిస్తాన్‌పై ఛేజింగ్‌లో మ్యాక్స్‌వెల్‌ చేసిన అద్భుత ద్విశతకం వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఒక డైమండ్‌లా మిగిలిపోయింది.  2023 లో ఓడిన భారత్.. 2024లో వెస్టిండీస్‌లో జరిగిన టీ ట‌్వంటీ వరల్డ్‌కప్‌లో నెగ్గింది.