ఇషాన్ కిషన్ తన మొదటి సెంచరీ, డబుల్ సెంచరీని శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో సంతృప్తి చెందలేదు. ట్రిపుల్ సెంచరీ చేసే అవకాశం మిస్ అయినందుకు తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.


“నేను 14.1 ఓవర్లు మిగిలి ఉండగానే ఔట్ అయ్యాను. చివరి వరకు క్రీజులో ఉంటే 300 స్కోరును కూడా సాధించేవాడినేమో.” అని కిషన్ ఇన్నింగ్స్ విరామం సమయంలో అన్నాడు. కేవలం 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ మైలురాయిని చేరుకున్న క్రిస్ గేల్ వన్డే ఫార్మాట్‌లో వేగవంతమైన డబుల్ సెంచరీని అందుకున్నాడు. 24 ఏళ్ల ఇషాన్ కిషన్ కెరీర్‌లో ఇది కేవలం 10వ వన్డే మాత్రమే. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 409 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత ఇన్నింగ్స్ 36వ ఓవర్లో ఇషాన్ కిషన్ అవుటయ్యాడు. అప్పటికే ఇషాన్ కిషన్ 210 పరుగులు సాధించాడు.


ఈ జార్ఖండ్ లెఫ్ట్ హ్యాండర్ వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా నిలిచాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ మూడుసార్లు ఈ ఫీట్‌ను సాధించారు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ఒక్కో డబుల్ సెంచరీ సాధించారు.


“ఇలాంటి లెజెండ్స్ మధ్య నా పేరు ఉండటం నా అదృష్టం. బ్యాటింగ్ చేయడానికి ఈ వికెట్ చాలా బాగుంది. నా ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది. సరైన బంతి పడితే, దాన్ని బలంగా బాదడానికి ప్రయత్నించాను. అని ఇషాన్ కిషన్ తన వ్యూహం గురించి వెల్లడించాడు.


ఈ రికార్డ్-బ్రేకింగ్ ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్‌తో పాటు విరాట్ కోహ్లి కూడా తనతో పాటు ఉన్నాడు. ఇషాన్ తన తొలి సెంచరీకి చేరువలో ఉన్నప్పుడు "అతన్ని కంట్రోల్ చేసినందుకు" విరాట్ కోహ్లీకి ధన్యవాదాలు తెలిపాడు.


"నేను విరాట్ భాయ్‌తో కలిసి బ్యాటింగ్ చేస్తున్నాను, నేను ఏ బౌలర్‌ను ఎంచుకోవాలి అని అతను గుర్తించాడు. నేను 95 పరుగుల వద్ద ఉన్నాను. సిక్సర్‌తో సెంచరీ సాధించాలనుకున్నాను. కానీ విరాట్ కోహ్లీ నన్ను శాంతింపజేశాడు. ఇది నీ మొదటి సెంచరీ కాబట్టి సింగిల్స్‌తో పూర్తి చేయమని చెప్పాడు.” అని విరాట్ కోహ్లీ గురించి ఇషాన్ కిషన్ తెలిపాడు.