భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్‌లో రెండో మ్యాచ్ ఆదివారం జరుగుతోంది. మొదటి మ్యాచ్ జరిగిన డబ్లిన్‌లోని ది విలేజ్ స్టేడియంలోనే ఈ మ్యాచ్ కూడా నిర్వహిస్తున్నారు. ఐర్లాండ్ ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
రెండు జట్లూ మొదటి టీ20లో ఆడిన జట్లతోనే బరిలోకి దిగుతున్నాయి. ఒక్క మార్పు కూడా చేయలేదు. టాస్ గెలిచి ఉంటే తాము కూడా బ్యాటింగ్ చేసేవాళ్లమని బుమ్రా అన్నాడు. వాతావరణం శుక్రవారంతో పోలిస్తే కాస్త మెరుగ్గా ఉందని స్కోరు బోర్డుపై భారీ స్కోరు ఉంచడానికి తాము ప్రయత్నిస్తామని తెలిపాడు.
అంతకు ముందు వర్షం అంతరాయం కలిగించిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత్ రెండు పరుగులతో డీఆర్ఎస్ పద్ధతిలో గెలుపు అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 139 పరుగులకు పరిమితం అయింది. అనంతరం భారత్ 6.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 47 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం మ్యాచ్‌కు ఆటంకం కలిగింది. తిరిగి మ్యాచ్ ప్రారంభం అయ్యే అవకాశం లేకపోవడంతో డీఆర్ఎస్ పద్ధతిలో భారత్‌ను అంపైర్లు విజేతగా ప్రకటించారు.
ఐర్లాండ్ తరఫున బ్యారీ మెకార్తీ (51 నాటౌట్: 33 బంతుల్లో, నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా తరఫున మ్యాచ్ జరిగినంతలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (24: 23 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), రుతురాజ్ గైక్వాడ్ (19 నాటౌట్: 16 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) రాణించారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే... భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసీద్ కృష్ణ, రవి బిష్ణోయ్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఐర్లాండ్ బౌలర్లలో క్రెయిగ్ యంగ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
ఐర్లాండ్ తుది జట్టు
పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్
భారత్ తుది జట్టు
రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా (వికెట్ కీపర్), రవి బిష్ణోయ్
Also Read: విరాట్ కోహ్లీ @ 15 ఏళ్లు! వికెట్ల మధ్యే 510 కి.మీ పరుగెత్తిన ఏకైక వీరుడు!
Also Read: నేను రిలాక్స్‌డ్‌గా ఉన్నా! ఎంజాయ్ చేసేందుకే వస్తున్నా - బుమ్రా!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial