RCB vs GT Preview: 52 రోజులు, 68 మ్యాచ్‌లు అయినా ఇప్పటికీ తేలని ప్లేఆఫ్స్ బెర్త్‌లు. ఐపీఎల్ -16 లో చాలా మ్యాచ్‌లలో ఫలితం లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్‌కు తేలింది. ఇప్పుడు ఇదే సూత్రాన్ని ఫాలో అవుతూ ప్లేఆఫ్స్ ఫోర్త్ ప్లేస్ కోసం లీగ్ లాస్ట్ డే లాస్ట్ మ్యాచ్ ఫలితం వరకూ వేచి ఉండాల్సిందే. నేటి రాత్రి 7.30 గంటలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. తమ హోమ్‌గ్రౌండ్ (చిన్నస్వామి)లో కీలక మ్యాచ్ ఆడనుంది.
ఆదివారం మధ్యాహ్నం ముంబై - హైదరాబాద్ మ్యాచ్ లో ఒకవేళ రోహిత్ సేన భారీ తేడాతో గెలిస్తే ఆర్సీబీ - జీటీ ఫలితం తేలేదాకా ప్లేఆఫ్స్ ఫోర్త్ స్పాట్ పై స్పష్టత రాదు. అలా కాకుండా రోహిత్ సేన ఓడితే ఆర్సీబీకి ఈ మ్యాచ్ నామమాత్రమే అవనుంది. మధ్యాహ్నం జరుగబోయే ముంబై మ్యాచ్ ఫలితంతో ఆర్సీబీ ఎలా ఆడాలనేది ఆధారపడి ఉంటుంది.
వర్షం ముప్పు..
బెంగళూరులో నిన్న వర్షం పడటం ఆ జట్టుకు ఆందోళన కలిగిస్తున్నది. ఆదివారం కూడా అదే రిపీట్ అయితే మ్యాచ్ సాగకుంటే మాత్రం ఇరు జట్లకూ చెరో పాయింట్ అందజేస్తారు. శనివారం రాత్రి వర్షమేమీ కురవకపోయినా ముప్పు అయితే పొంచే ఉంది. ఒకవేళ హైదరాబాద్ పై ముంబై గెలిస్తే అప్పుడు బెంగళూరుకు ఇది ప్రమాదమే. ముంబై ఓడితే.. గుజరాత్ తో మ్యాచ్ గెలిచినా ఓడినా.. వర్షం వల్ల రద్దు అయినా బెంగళూరుకు చింత లేదు. ఇరు జట్లు సమాన మ్యాచ్ (13) లు సమాన పాయింట్లు (14) తో ఉన్నా ముంబై నెట్ రన్ రేట్ (-0.128) కంటే ఆర్సీబీ ( +0.180) మెరుగ్గా ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.
ఆర్సీబీకి బ్యాటింగే బలం. కేజీఎఫ్ (కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్) రాణిస్తే ఆ జట్టుకు తిరుగుండదు. అదే సమయంలో వీరు విఫలమైతే ఆ జట్టుకు కష్టాలు తప్పవు. సొంత గ్రౌండ్ లో ఆడుతుండటం ఆ జట్టుకు కలిసొచ్చేదే అయినా గుజరాత్ బౌలింగ్ దాడిని డుప్లెసిస్ గ్యాంగ్ ఎలా ఎదుర్కుంటుదనేది ఆసక్తికరం.
ప్రయోగాలకు సిద్ధమైన గుజరాత్..
వరుసగా రెండో సీజన్ లో ప్లేఆఫ్స్ కు అర్హత సాధించిన గుజరాత్ టైటాన్స్‌కు ఈ మ్యాచ్ ఫలితంతో పెద్దగా ఉపయోగం లేదు. కానీ క్వాలిఫైయర్ -1 కు ముందు గెలిచిన ఉత్సాహంతో ఉండాలని హార్ధిక్ సేన భావిస్తున్నది. నామమాత్రపు మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ కోసం గుజరాత్ జట్టు కీలక ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. జోషువా లిటిల్ తిరిగి జట్టుతో చేరడంతో అతడు ఈ మ్యాచ్ లో బరిలోకి దిగుతాడు. విజయ్ శంకర్ కూడా బెంగళూరులో ఆడే అవకాశముంది.
తుది జట్లు (అంచనా) :
గుజరాత్ టైటాన్స్ : శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, జోషువా లిటిల్, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ
ఇంపాక్ట్ సబ్ : విజయ్ శంకర్, మోహిత్ శర్మ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రర్, దినేశ్ కార్తీక్, మైకేల్ బ్రేస్‌వెల్, అనూజ్ రావత్, వేన్ పార్నెల్, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్
ఇంపాక్ట్ సబ్ : షాబాజ్ అహ్మద్, హెజిల్‌వుడ్