Kohli vs Gambhir: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ.. లక్నో సూపర్ జెయింట్స్  ఆటగాడు  నవీన్ ఉల్ హక్, మెంటార్ గౌతం గంభీర్‌తో ఏ క్షణాన గొడవ పెట్టుకున్నాడో ఏమో గానీ  ఇప్పట్లో దీనికి శుభం కార్డు పడేట్టు కనిపించడం లేదు. మే1 తర్వాత వీరి సోషల్ మీడియాలలో ఒకరి మీద ఒకరు వారి పేరు పెట్టకుండా  కౌంటర్లు ఇచ్చుకుంటూ పుచ్చుకుంటూ ఈ గొడవను మరింత సా...గదీస్తున్నారు. వాంఖెడే వేదికగా  ముంబై - బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ ఒక్క  పరుగు మాత్రమే చేసి ఔటయ్యాక  గంభీర్, నవీన్ ఉల్ హక్‌లు రన్ మిషీన్‌ను మళ్లీ గెలికారు. 


మామిడి పండ్లు బాగున్నాయట.. 


ముంబైతో మ్యాచ్ లో కోహ్లీని బెహ్రన్‌డార్ఫ్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌లోనే ఔట్ చేశాడు.   ఈ మ్యాచ్‌ను ఫాలో అవుతున్న  నవీన్ ఉల్ హక్.. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో టీవీలో ముంబై ఇండియన్స్  మ్యాచ్ కనిపించేలా ముందు మామిడిపండ్లను తింటూ.. ‘స్వీట్ మ్యాంగోస్’ అని క్యాప్షన్ ఇచ్చాడు. 


 






గంభీర్ తన స్టైల్‌లో..


లక్నో మెంటార్ గంభీర్ కూడా ముంబై - బెంగళూరు మ్యాచ్‌ను ఫాలో అవుతున్నట్టున్నాడు.  కోహ్లీని బెహ్రన్‌డార్ఫ్ ఔట్ చేస్తున్న బంతిని  స్క్రీన్ షాట్ తీసి.. ‘వాట్ ఎ ప్లేయర్ @బెహ్రాన్‌డార్ఫ్’ అని  చప్పట్లు కొడుతున్న ఎమోజీలు పెట్టాడు.  


 






కోహ్లీకి కౌంటర్ గానే.. 


లక్నోతో మ్యాచ్ లో కోహ్లీ ఈ ఇద్దరితో గొడవ పడి   కాస్త సద్దుమణిగిన తర్వాత  ఇటీవలే   సూపర్ జెయింట్స్.. గుజరాత్ టైటాన్స్ తో ఆడింది.  ఎప్పుడూ లేనిది కోహ్లీ ఈ మ్యాచ్ లో  వృద్ధిమాన్ సాహాను పొగుడుతూ  తన ఇన్‌స్టా స్టోరీస్ లో అతడి ఫోటోను షేర్ చేసి ‘వాట్ ఎ ప్లేయర్ @వృద్ధి’ అని  షేర్ చేశాడు.  ఇది   లక్నోకు  కౌంటర్ అని కోహ్లీ ఫ్యాన్స్ తో పాటు  వీళ్ల గొడవ గురించి ఏ,బీ,సీ,డీలు తెలిసిన వారు కూడా అదే ఫీల్ అయ్యారు. 


ఇక ఇప్పుడు నవీన్, గంభీర్ కు టైమ్ వచ్చింది.  మరి ఈ ఛాన్స్‌ను  ఈ ఇద్దరూ వదులుతారా..? అస్సలే అక్కడ గంభీర్. అందుకే అసలు ఇంతవరకు బెహ్ర‌న్‌డార్ఫ్ ముఖం  కూడా చూసి ఎరుగని అతడు  ఇప్పుడు అతడిని పొగుడుతూ  పోస్ట్   పెట్టడం కోహ్లీకి కౌంటర్  ఇచ్చేందుకేనని    సోషల్ మీడియా కోడై కూస్తున్నది. ఈ ట్రయాంగిల్  రైవల్రీ స్టోరీపై సోషల్ మీడియాలో  వస్తున్న మీమ్స్  నెటిజన్లను అలరిస్తున్నాయి. చాలా మంది ఫ్యాన్స్  దీనిని ‘వొడువని ముచ్చట’గా అభివర్ణిస్తున్నారు.