MI vs SRH Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2023 ఎడిషన్ లీగ్ దశకు  నేటితో ఎండ్ కార్డ్ పడనుంది. ఐపీఎల్-16 లో భాగంగా ఆదివారం ఆఖరి  లీగ్ మ్యాచ్‌లు జరుగుతున్నా ఇప్పటికీ ప్లేఆఫ్స్‌కు వెళ్లే నాలుగో టీమ్ ఎవరో తేలలేదు. రేసులో మూడు జట్లు ఉన్నాయి. ఇందులో ఒకటి ముంబై ఇండియన్స్.  నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు రోహిత్ సేన.. వాంఖెడే వేదికగా  నేడు సన్  రైజర్స్ హైదరాబాద్‌తో పోటీ పడనుంది. ప్లేఆఫ్స్‌కు చేరడానికి ముంబైకి ఇదే ఆఖరి మోక (అవకాశం). 


ముంబై గెలిస్తే సరిపోదు.. 


ఐపీఎల్- 16 లో ముంబై ఇండియన్స్ 13 మ్యాచ్‌లు ఆడి ద ఏడింట గెలిచి  ఆరు ఓడింది.  చేతిలో 14 పాయింట్లు నెట రన్ రేట్  (-0.128)  మైనస్ లో  ప్లేఆఫ్స్  రేసులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తీవ్ర పోటీని ఎదుర్కుంటుంది. రోహిత్ సేన తమ గత లీగ్ మ్యాచ్ లో  లక్నో  సూపర్ జెయింట్స్‌తో విజయానికి దగ్గరగా వచ్చి ఆఖరి ఓవర్లో 11 పరుగులు  చేయలేక  గెలుపు ముందు బొక్క బోర్లా పడింది.  ఈ మ్యాచ్ గెలిచుంటే ముంబైకి ఆరామ్‌సే  ప్లేఆఫ్స్‌కు వెళ్లేది. కానీ ‘స్క్రిప్ట్’లో  అలా లేదు.   


ఇక ఇప్పుడు  ముంబై.. హైదరాబాద్‌పై ఏదో ఆడామా.. గెలిచామా.. అంటే కుదరదు. వాంఖెడేలో హైదరాబాద్‌ను కనీసం  80 ప్లస్ పరుగుల తేడాతో ఓడించాలి. ఇక్కడితోనే అయిపోయిందా..? అంటే కుదరదు.  చివరి లీగ్ మ్యాచ్ లో  గుజరాత్ టైటాన్స్ చేతిలో ఆర్సీబీ  ఓడిపోవాలి. వర్షం పడి  ఆమ్యాచ్ రద్దైనా (అప్పుడు ఆర్సీబీ కంటే ముంబైకి   ఒక్క పాయింట్ ఎక్కువగా ఉంటుంది)  ముంబైకి సంబురమే. ఇందులో ఏ ఒక్కటి ముంబైకి అనుకూలంగా లేకపోయినా  రోహిత్ సేన.. నేటి రాత్రికి  టీవీలు కట్టేసి  బ్యాగ్‌లు సర్దుకోవడమే..!


 






సన్ రైజర్స్ బిందాస్.. 


ముంబై కథ అలా ఉంటే హైదరాబాద్ పరిస్థితి మరోలా ఉంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి అధికారికంగా నిష్క్రమించి ఈ సీజన్ లో 13 మ్యాచ్ లలో నాలుగే విజయాలతో  పాయింట్ల పట్టికలో  చివరి స్థానంలో ఉన్న సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో గెలిచినా ఓడినా  దానికి పోయేదేం లేదు. ఒకవేళ గెలిస్తే మాత్రం  ఢిల్లీని  వెనక్కినెట్టి 9వ స్థానానికి చేరుకుంటుంది. ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డులు మెరుగుపర్చుకోవడానికి తప్ప సన్ రైజర్స్ కు ఈ ఫలితంతో ఏ ఉపయోగమూ లేదు. 


తుది జట్లు (అంచనా): 


ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, నెహల్ వధేర,  టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, కామెరూన్ గ్రీన్, క్రిస్ జోర్డాన్, హృతీక్ షోకీన్, పియూష్ చావ్లా,   జేసన్ బెహ్ర‌న్‌డార్ఫ్ 


ఇంపాక్ట్ సబ్ : తిలక్ వర్మ, కుమార్ కార్తీకేయ, ఆకాశ్ మధ్వాల్


సన్ రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి,  ఎయిడెన్ మార్క్‌రమ్,   హెన్రిచ్ క్లాసెన్, హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగి, మయాంక్ దగర్, టి. నటరాజన్ 


ఇంపాక్ట్ సబ్ : ఉమ్రాన్ మాలిక్, నితీశ్ రెడ్డి