భారత ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను అతని మాజీ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ (DC) కోల్‌కతా నైట్ రైడర్స్‌కు (KKR) ట్రేడ్ చేసింది. దీంతో శార్దూల్ ఠాకూర్ వచ్చే సంవత్సరం ఐపీఎల్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడనున్నాడు. అన్ క్యాప్డ్ ముంబై క్రికెటర్ అమన్ ఖాన్ కోసం ఢిల్లీ శార్దూల్‌ను ట్రేడ్ చేసింది. IPL 2022 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) శార్దూల్ ఠాకూర్‌ను రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. అతను IPL 2022లో 14 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు సాధించాడు. ఇందులో బెస్ట్ గణాంకాలు 4/36గా ఉన్నాయి. కానీ ఓవర్‌కు దాదాపు 10 పరుగులు ఇచ్చాడు. బ్యాటింగ్‌తో అతను 137.93 స్ట్రైక్ రేట్, 10.81 సగటుతో 120 పరుగులు చేశాడు.


IPL 2022 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 25 ఏళ్ల అమన్ ఖాన్‌ను INR 20 లక్షలకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. "రాబోయే TATA IPL 2023 కోసం శార్దూల్ ఠాకూర్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ట్రేడ్ అయ్యాడు." అని IPL నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.


"వర్ధమాన ఆల్ రౌండర్ అమన్ ఖాన్ కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్నాడు." మరో ఆల్ క్యాష్ డీల్‌లో టైటాన్స్ నుంచి న్యూజిలాండ్‌కు చెందిన లాకీ ఫెర్గూసన్, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన రహ్మానుల్లా గుర్బాజ్‌ల తర్వాత కేకేఆర్ ట్రేడ్ ఇన్ చేసిన మూడో ఆటగాడు ఠాకూర్.


ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ రిటెన్షన్స్: రిషబ్ పంత్, డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, మిచెల్ మార్ష్, సర్ఫరాజ్ ఖాన్, అన్రిచ్ నార్కియా, కుల్దీప్ యాదవ్.


ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిన ఆటగాళ్లు: శార్దూల్ ఠాకూర్, టిమ్ సిఫెర్ట్, కేఎస్ భరత్, మన్‌దీప్ సింగ్, అశ్విన్ హెబ్బార్.