Quadruple Century:  వన్డే ఫార్మాట్లో కొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. కర్ణాటకలోని షిమోగలో జరిగిన అంతర జల్లా అండర్- 16 టోర్నీలో క్వాడ్రాపుల్ సెంచరీ నమోదైంది. ఓ యువ ఆటగాడు ఒక ఇన్నింగ్స్ లో 400 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. 


ఈ టోర్నీలో భాగంగా భద్రావతి- సాగర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. సాగర్ టీంకు ప్రాతినిధ్యం వహిస్తున్న తన్మయ్ మంజునాథ్ అనే ఆటగాడు 165 బంతుల్లో 407 పరుగులు చేశాడు. అందులో 48 ఫోర్లు, 24 సిక్సర్లు ఉన్నాయి. దీంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 583 పరుగులు చేసింది. బదులుగా భద్రావతి జట్టు కేవలం 73 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫలితంగా ఘోర పరాజయాన్ని చవిచూసింది. 
 
అయితే తన్మయ్ ఆడిన ఈ ఇన్నింగ్స్ కు అంతర్జాతీయ గుర్తింపు రాదు. అంతర్జాతీయ క్రికెట్ లో వన్డే ఫార్మాట్లో భారత ఆటగాడు రోహిత్ శర్మ అత్యధిక పరుగులతో ఉన్నాడు. 2014 నవంబరులో శ్రీలంకపై హిట్ మ్యాన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. 173 బంతుల్లో 264 పరుగులు చేశాడు. అంతర్జాతీయ వన్డేల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇప్పటికే రోహిత్ ఖాతాలో 3 వన్డే డబుల్ సెంచరీలు ఉన్నాయి.