Jasprit Bumrah not in Top 100 of ICC T20I Rankings:  టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా(Jasprit Bumrah) పేరు ఇప్పుడు క్రికెట్‌(Cricket) ప్రపంచంలో మరోసారి మార్మోగిపోతోంది. పాకిస్థాన్‌(Pakistan)తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు అద్భుత విజయాన్ని అందించిన బుమ్రాపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత్‌కు అవసరమైన ప్రతీసారి బుమ్రా తన అద్భుత ప్రదర్శనతో టీమిండియాకు విజయాన్ని అందించాడు. బులెట్ల దూసుకొచ్చిన బుమ్రా బంతులను ఎదుర్కొనేందుకు పాక్‌ బ్యాటర్ల  వద్ద అసలు సమాధానామే లేకుండా పోయింది. అసలు బ్యాట్‌కు బంతిని తగిలిస్తే చాలు మహాప్రభో అని పాక్‌ బ్యాటర్లు భావించారంటే అతిశయోక్తి ఏం లేదు. అయితే భారత బౌలింగ్‌ విభాగ భారాన్ని మోస్తున్న బుమ్రా... ఐసీసీ టీ 20 ర్యాంకింగ్స్‌లో టాప్‌ 100లోనూ లేకపోవడం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ స్టార్‌ పేసర్‌ టాప్‌ 100లో కూడా ఎందుకు లేడంటూ క్రికెట్‌ అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. ఇంతకీ బుమ్రా టాప్‌ -100లో ఎందుకు లేడంటే..


 

గాయమే కారణం

జస్ప్రీత్ బుమ్రా కచ్చితమైన లైన్‌ లెంగ్త్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తుంటాడు. అలాంటి బౌలర్‌ టాప్ 100లో కూడా లేకపోవడమే ఇప్పుడు వైరల్‌గా మారింది. ఐసీసీ టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా టాప్ 100లో కూడా చోటు దక్కించుకోలేదు. గాయం కారణంగా బుమ్రా చాలా మ్యాచులు ఆడకపోవడంతో బుమ్రా టాప్‌ 100లో చోటు దక్కించుకోలేదు. గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఏడాదికి పైగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఐసీసీ టీ 20 ర్యాకింగ్స్‌లో బుమ్రా ర్యాంకు దిగజారడానికి ఇదే ప్రధాన కారణం. 2022జూలైలో బుమ్రా వెన్నునొప్పితో బాధపడ్డాడు. ఈ కారణంగా చాలా కాలం పాటు బుమ్రా క్రికెట్‌కు దూరంగా ఉండవలసి వచ్చింది. ఆసియా కప్, చివరి టీ20 ప్రపంచకప్‌లో కూడా గాయం కారణంగా ఆడలేకపోయాడు. బుమ్రా 2023 ఆగస్టులో తిరిగి మైదానంలో అడుగుపెట్టినప్పటికీ అతనికి టీ T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. మళ్లీ గాయం తిరగబెడుతుందనే కారణంతో బీసీసీఐ బుమ్రాను చాలా జాగ్రత్తగా కాపాడుకుంది. కీలకమైన మ్యాచుల్లో మాత్రమే అతడిని ఆడించింది. దీంతో బుమ్రా చాలా తక్కువ టీ 20 మ్యాచులు ఆడాడు. ఇలా తక్కువ మ్యాచులు ఆడడంతో ICC T20 అంతర్జాతీయ ర్యాంకింగ్‌లో బుమ్రా ర్యాంకుకు 110కి చేరుకుంది. 

ఈ టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా ఇప్పటివరకూ రెండు మ్యాచులు ఆడాడు. ఈ రెండు మ్యాచుల్లో బుమ్రా 2.86 ఎకానమీతో 20 పరుగులు మాత్రమే ఇచ్చి చ్చి 5 వికెట్లు పడగొట్టాడు. 

 

పాక్‌పై అద్భుతమే

పాకిస్థాన్‌తో జరిగిన లోస్కోరింగ్ మ్యాచ్‌లో అయితే బుమ్రా అద్భుతమే చేశాడు. పాక్‌ గెలుపు ఖాయమనుకున్న వేళ మ్యాచ్‌ను మలుపు తిప్పేశాడు. భారత్ నిర్దేశించిన 120 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అతని అద్భుతమైన స్పెల్‌ భారత్‌కు విజయాన్ని అందించింది. పాకిస్తాన్‌ను 6 పరుగుల తేడాతో ఓడించడంలో బుమ్రా ముఖ్యమైన పాత్ర పోషించాడు. పాకిస్థాన్‌పై బుమ్రా 4 ఓవర్లలో 14 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచులో బుమ్రాకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.