Ind Vs Aus Test series: యువ బ్యాటింగ్ సంచలనం యశస్వి జైస్వాల్ చేసిన పనికి భారత కెప్టెన్ రోహిత్ శర్మ అసహనానికి గురయ్యాడు. దీంతో అతడికి శిక్ష విధించాడు. ఈ సంఘటన తాజాగా చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ లో మూడో టెస్టు జరుగనుంది. ఇందుకోసం అడిలైడ్ నుంచి ఏయిర్ పోర్టుకు బయల్దేరేందుకు హోటల్ లాబీలో వెయిట్ చేస్తోంది. రోహిత్, సహాయక సిబ్బందితో సహా అందరూ లాబీలో జైస్వాల్ కోసం వెయిట్ చేశారు. అయితే అతను ఎంతకీ రాకపోవడంతో అతడిని వదిలేసే, విమానశ్రయానికి రెండు బస్సుల్లో వెళ్లిపోయారు. తన పనులన్నీ పూర్తి చేసుకుని ఇరవై నిమిషాల తర్వాత లాబీలోకి వచ్చిన జైస్వాల్ షాకయ్యాడు. టీమ్ మేనేజ్మెంట్ తనను వదిలేసి వెళ్లడంతో అవాక్కయ్యాడు.
తర్వాత ఏం జరిగిందంటే..
అయితే ఏయిర్ పోర్టుకు వెళ్లడం కోసం ప్రత్యేకంగా ఒక కారును జైస్వాల్ కోసం భారత టీమ్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేసింది. ఇందులో సెక్యూరిటీ అధికారులు కూడా ఉన్నారు. దీంతో ఊపిరి పీల్చుకున్న జైస్వాల్ బతుకు జీవుడా అనుకుంటూ ఆ కారులో ఏయిర్ పోర్టుకు బయలు దేరాడు. నిజానికి విమానం ఉదయం పది గంటలకు బయల్దేరాల్సి ఉండగా, ఎనిమిదిన్నర గంటల వరకు లాబీలో టీమ్ మేనేజ్మెంట్ జైస్వాల్ కోసం వెయిట్ చేసింది. అయితే యువ క్రికెటర్ లేట్ చేయడంతో అసహనంతో రోహిత్, గంభీర్ బస్సులో ఏయిర్ పోర్టుకు వెళ్లినట్లు ఒక కథనం వెల్లడించింది.
Also Read: 2024 FlashBack: వన్డేల్లో పీడకలగా మారిన ఈ ఏడాది.. ఒక్క మ్యాచ్ లోనూ గెలుపొందని భారత్
కొత్త అవతరామెత్తిన బుమ్రా..
విభిన్నమైన బౌలింగ్ యాక్షన్ తో ప్రత్యర్తికి చుక్కులు చూపే భారత ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. తాజాగా కొత్త అవతారమెత్తాడు. నెట్ సెషన్ పాల్గొన్న బుమ్రా.. అటు పేస్ బౌలింగ్ చేయడంతోపాటు, ఇటు లెగ్ స్పిన్ కూడా ప్రాక్టీస్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. బుమ్రాలో స్పిన్ ప్రతిభ కూడా దాగుందని పేర్కొంటూ అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. కేఎల్ రాహుల్, జైస్వాల్ కు తన లెగ్ స్పిన్ బౌలింగ్ రుచి చూపించినట్లు సమాచారం. మరోవైపు రెండో టెస్టు సందర్భంగా గాయపడిన బుమ్రా.. ప్రస్తుతం పూర్తి ఫిట్ గా కనిపిస్తున్నాడు. బౌలింగ్ లో ఎలాంటి తడబాటు లేకుండా వేస్తున్నాడు. దీంతో అతని ఫిట్ నెస్ పై కమ్ముకున్న నీలి మేఘాలు తొలిగినట్లు అయ్యింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్.. ఆ దేశ జట్టుతో ఐదు టెస్టుల బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్ ఆడుతోంది. ఇప్పటివరకు రెండు టెస్టులు జరగగా, తొలి మ్యాచ్ లో భారత్ 295 పరుగుల భారీ తేడాతో గెలుపొందగా, తర్వాత మ్యాచ్ లో ఆసీస్ పది వికెట్లతో సునాయాస విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ఈనెల 14 నుంచి బ్రిస్బేన్ లో జరుగుతుంది.