Smriti Mandhana Total Centuries: భారత డాషింగ్ మహిళా బ్యాటర్ స్మృతి మంధాన సత్తాచాటింది. మహిళా క్రికెట్లో ప్రపంచ రికార్డు నెలకొల్పి వారెవా అనిపించింది. బుధవారం ఆస్ట్రేలియాలో జరిగిన మూడోవన్డేలో తను ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్ లో సెంచరీ (109 బంతుల్లో 105, 14 ఫోర్లు, 1 సిక్సర్) సాధించడం ద్వార మంధాన ఎవరికీ సాధ్యం కానీ రికార్డు తన ఖాతలో వేసకుంది. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన బ్యాటర్ గా నిలిచింది. ప్రస్తుత సెంచరీ తనకు ఈ ఇయర్లో నాలుగోది కావడం విశేషం. బెలిండా క్లార్క్ (1997), మెగ్ ల్యానింగ్ (2016), అమీ సాటర్త్ వైట్ (2016), లారా వాల్వర్ట్, నాట్ స్కివర్ , సోఫీ డివైన్, సిద్రా అమీన్ ఇప్పటివరకు ఒక క్యాలెండర్ ఇయర్లో మూడేసి వన్డే శతకాలు బాదారు. అయితే తాజా సెంచరీతో వీరందరిని దాటి మంధాన ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మరోవైపు వన్డేల్లో మంధానకిది తొమ్మిదో సెంచరీ కావడం విశేషం. ఈ నేపథ్యంలో అత్యధిక సెంచరీలు చేసిన ఆసియా బ్యాటర్ గా చమరి ఆటపట్టు (శ్రీలంక-9 సెంచరీలు) రికార్డును సమం చేసింది.
Also Read: Ind Vs Aus Test Series: తప్పదు, రోహిత్ త్యాగం చేయాల్సిందే- బ్యాటింగ్ ఆర్డర్ లో స్థానంపై పుజారా సూచన
క్లీన్ స్వీప్ అయిన భారత్..
మంధాన మెరుపు సెంచరీ సాధించిన భారత్ ఈ మ్యాచ్ లో గెలుపొందలేకపోయింది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు వరుసగా ఓడి, మూడు వన్డేల సిరీస్ ను ఆసీస్ కు చేజార్చుకున్న భారత్ కు కనీసం ఈ మ్యాచ్ లో కూడా విజయం దక్కలేదు. ఆసీస్ నిర్దేశించిన 299 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేసేందుకు ప్రయత్నించిన భారత మహిళా జట్టు 215 పరుగులకే ఆలౌటైంది. దీంతో మూడు వన్డేల సిరీస్ 3-0తో ఆసీస్ వైట్ వాష్ చేసింది.
మంధాన సెంచరీతో సత్తా చాటినప్పటికీ, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. హర్లీన్ డియోల్ 39 పరుగులు సాధించినా, తనకు లభించినా శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయింది. ఒక దశలో 35 ఓవర్లకు 184/3తో ఉన్న భారత్.. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 29 పరుగులు జోడించి ఆలౌటయ్యారు. నిజానికి మంధాన బ్యాటింగ్ చేస్తున్నంత సేపు విజయం భారత్ వైపే మొగ్గింది. అయితే ఆ తర్వాత కథ మారిపోయింది. మంధాన వేసిన పునాధిపై పరుగులు రాబట్టడంలో భారత బ్యాటర్లు తడబడ్డారు. ఆసీస్ బౌలర్ల ఒత్తిడికి తలొగ్గి వికెట్లు కోల్పోయారు. దీంతో కనీసం ఓదార్పు విజయం సాధిస్తుందనుకున్న భారత అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి.
గార్డెనర్ ఆల్ రౌండ్ ప్రతిభ..
ఆష్లీ గార్డెన్ 30 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించింది. మేగాన్ షట్, అలానా రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 298 పరుగులు చేసింది. అన్నాబెల్ సదర్లాండ్ (110) సూపర్ సెంచరీతో సత్తా చాటింది. కెప్టెన్ తాహ్లియా మెక్గ్రాత్ (56 నాటౌట్), అష్లే గార్డెనర్ (50) ఫిఫ్టీలతో చెలరేగారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డికి నాలుగు వికెట్లు దక్కగా, దీప్తీ శర్మ ఒక వికెట్ సాధించింది.
Also Read: ఐసీసీ ర్యాంకింగ్స్ లో కోహ్లి, రోహిత్ కు షాక్- పంత్ కు కూడా తగిలిన సెగ