IND vs PAK, WT20: మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం జరిగే తొలి మ్యాచ్ లో భారత మహిళల జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడనుంది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు విజయంతో టోర్నీని ప్రారంభించాలని చూస్తోంది. ఈ పొట్టి ఫార్మాట్ లో ఇప్పటివరకు ఇండియా ఉమెన్స్ టీం కప్పును గెలవలేదు. అయితే ఈసారి కప్పును అందుకోవాలని దృఢ నిశ్చయంతో ఉంది.
ర్యాంకింగ్స్ లో పాక్ కంటే భారత్ మెరుగైన స్థానంలో ఉంది. పాకిస్థాన్ 7వ స్థానంలో ఉండగా.. భారత జట్టు నాలుగో స్థానంలో కొనసాగుతోంది. దాయాదుల మధ్య పోరు అంటే ఎప్పుడూ ఆసక్తికరమే. కాబట్టి ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగడం ఖాయమే. అయితే భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన గాయంతో దూరమైనట్లు సమాచారం. దీంతో షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, రేణుకా ఠాకూర్ వంటి ఆటగాళ్లపై ఆశలు ఉన్నాయి.
భారత్- పాక్ మధ్య మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది? ఎందులో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది లాంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.
టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మహిళల మధ్య మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?
ఫిబ్రవరి 12, 2023 ఆదివారం రోజు భారత్- పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. కేప్ లాండ్ లోని న్యూలాండ్స్ ఈ మ్యాచ్ కు వేదిక కానుంది.
భారత్ మహిళలు వర్సెస్ పాకిస్థాన్ మహిళలు టీ20 ప్రపంచకప్ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మహిళల మధ్య మ్యాచ్ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానుంది.
ఈ మ్యాచ్ ను ఎక్కడ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది?
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో భారత్ మహిళల వర్సెస్ పాకిస్థాన్ మహిళల టీ20 ప్రపంచకప్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
స్మృతి మంథానకు గాయం
వేలికి గాయం కావడంతో స్మృతి మంథన ఇబ్బంది పడుతోంది. ఈ కారణంగానే ఆమె పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు దూరమైంది. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం మంథన వేలికి ఎలాంటి ఫ్రాక్చర్ లేదని రిషికేశ్ కనిట్కర్ చెప్పారు. ఇది కొంచెం ఉపశమనం కలిగించే అంశం. కాబట్టి రెండో మ్యాచ్‌కు స్మృతి మంధాన అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
డబ్ల్యూపీఎల్
భారత క్రికెటర్ స్మృతి మంథన గత కొన్నేళ్లుగా టీమ్ ఇండియాకు అత్యంత ముఖ్యమైన ప్లేయర్ గా ఉంది. తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చాలా సందర్భాలలో జట్టును గెలిపించింది. ప్రస్తుతం ఆమె మహిళా బ్యాటర్ ల టీ20 ర్యాంకింగ్స్‌లో కూడా మూడో స్థానంలో ఉంది. డబ్ల్యూపీఎల్ లో ఆమె చేరబోయే జట్టుకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో వేలంలో స్మృతి మంధాన అత్యంత ఖరీదైన ప్లేయర్లలో ఒకరిగా నిలిచే అవకాశం ఉంది.