India vs Hong Kong Live Streaming: చిరకాల శత్రువు పాకిస్థాన్‌పై అద్భుత విజయంతో ఆసియాకప్‌ను ఆరంభించిన టీమ్‌ఇండియా మరో సమరానికి సిద్ధమైంది. బుధవారం పసికూన హాంకాంగ్‌తో తలపడనుంది. విజయావకాశాలు హిట్‌మ్యాన్‌ సేనకే ఎక్కువ! అయితే అలసత్వం అస్సలు పనికిరాదు. తమదైన రోజున పొట్టి ఫార్మాట్లో ఏ జట్టైనా అద్భుతాలు చేయగలదు. ఇక ఈ మ్యాచ్‌ వేదిక, టైమ్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌, టెలికాస్ట్‌ వివరాలు మీకోసం.


When Does India vs Hong Kong T20 match Begin (Date and Time in India) in Asia cup 2022?


భారత్‌, హాంకాంగ్‌ టీ20 వేదిక దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ గ్రౌండ్‌. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ మొదలవుతుంది. 7:00 గంటలకు టాస్‌ వేస్తారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు మ్యాచ్‌ మొదలవుతుంది.


Where to Watch India vs Hong Kong T20 match?


ఆసియాకప్‌ 2022 ప్రసార హక్కులను స్టార్‌ స్పోర్ట్స్‌ ఇండియా గెలుచుకుంది. భారత్‌ x హాంకాంగ్‌ సహా మిగతా మ్యాచులన్నీ స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానళ్లలో ప్రసారం అవుతాయి. స్టార్‌సోర్ట్స్‌ 1, స్టార్‌స్పోర్ట్స్‌ 1హెచ్‌డీ, స్టార్‌ స్పోర్ట్స్‌ హిందీ ఛానళ్లలో వీక్షించొచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, తమిళం, మళయాలం భాషాల్లో చూడొచ్చు.


How to Watch India vs Hong Kong T20 match Live Streaming Online for Free in India?


ఆసియాకప్‌ మ్యాచులను లైవ్‌ స్ట్రీమింగ్‌లో వీక్షించొచ్చు. ఈ హక్కులను డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ సొంతం చేసుకుంది. సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నవాళ్లు నేరుగా లైవ్‌ స్ట్రీమింగ్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు. కొన్ని టెలికాం సంస్థలు సైతం స్ట్రీమింగ్‌ను ఆఫర్‌ చేస్తున్నాయి.


Asia cup 2022, India Schedule


ఆగస్టు 27న ఆసియాకప్‌ మొదలైంది. సెప్టెంబర్‌ 11న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఆగస్టు 28, ఆదివారం పాక్‌తో మ్యాచులో టీమ్‌ఇండియా గెలిచింది. ఆగస్టు 31, బుధవారం రోజు హాంకాంగ్‌తో తలపడుతోంది. సెప్టెంబర్‌ ౩ నుంచి సూపర్‌-4 మ్యాచులు జరుగుతాయి.


India vs Hong Kong T20 ProbableXI


భారత్‌: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్


హాంకాంగ్‌: నిజాకత్‌ ఖాన్‌ (కెప్టెన్‌), కించిత్‌ షా, అఫ్తాబ్‌ హుస్సేన్‌, ఐజజ్‌ ఖాన్‌, అతీక్‌ ఇక్బాల్‌, బాబర్ హయత్‌, ధనంజయ రావ్‌, ఎహ్‌సన్‌ ఖాన్‌, హరూన్‌ అర్షద్‌, స్కాట్‌ మెక్‌చినీ, మహ్మద్‌ ఘజన్‌ఫర్‌, మహ్మద్‌ వహీద్‌, ఆయుష్ శుక్లా, అహన్ త్రివేదీ, వాజిద్‌ షా, యాసిమ్‌ ముర్తాజా, జీషన్‌ అలీ