Asia Cup 2022, BANG vs AFG :   ఆసియా కప్ లో భాగంగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై అఫ్గానిస్థాన్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 128 పరుగుల టార్గెట్ ను అఫ్గాన్ బ్యాట్స్ మెన్ అవలీలగా ఛేదించారు. అఫ్గానిస్తాన్ 18.3 ఓవర్లలో మూడు వికెట్లల నష్టానికి 131 పరుగులు చేసింది. అఫ్గానిస్తాన్ బ్యాట్స్ మెన్ లలో ఇబ్రహీం జద్రాన్ 41 బంతుల్లో 41 పరుగులు చేశాడు. నజీబుల్లా జద్రాన్ 17 బంతుల్లో 43 పరుగులు చేశాడు. 






షార్జా క్రికెట్ స్టేడియంలో మంగళవారం జరిగిన ఆసియా కప్ 2022 మూడో మ్యాచ్ లో అఫ్గానిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్ 18.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. అంతకుముందు ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టడంతో అఫ్గానిస్థాన్ బంగ్లాదేశ్‌ను 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 127 పరుగులకు పరిమితం చేసింది. బంగ్లా బ్యాట్స్ మెన్ లో మొసద్దెక్ హోస్సేన్ 31 బంతుల్లో 48 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతక ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్  అఫ్గానిస్థాన్ కు 128 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దుబాయ్ షార్జా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఆసియా కప్ మూడో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ టాస్ గెలిచి,  మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.


అఫ్గాన్ బౌలర్ల ఎదురుదాడి


పవర్‌ప్లేలో బంగ్లాదేశ్ ఓపెనర్లు నయీమ్ షేక్, అనముల్ హక్ బిజోయ్‌ వికెట్లను కోల్పోయింది. నయీమ్ (8 బంతుల్లో 6 పరుగులు), అనముల్ (14 బంతుల్లో 5 పరుగులు) ఇద్దరినీ అఫ్గాన్ బౌలర్ ముజీబుర్ రహ్మాన్ బౌల్డ్ చేశాడు. రెండో ఓవర్ చివరి బంతికి నయీమ్ అవుట్ కాగా, అదే బౌలర్ వేసిన నాలుగో ఓవర్ చివరి బంతికి అనముల్ ఔటయ్యాడు. పవర్‌ప్లేలో కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (9 బంతుల్లో 11) వెనుదిరిగాడు. ముష్ఫికర్ రహీమ్ 1 (4) పరుగుల వద్ద రషీద్ ఖాన్ చేతిలో అవుట్ కావడంతో బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది.






అఫ్గానిస్థాన్ టార్గెట్ 128 
 
అఫ్గాన్ బౌలర్ల దాటికి బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు క్యూ కట్టారు. నిర్ణీత వ్యవధిలో బంగ్లా జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. మొసద్దెక్ 31 బంతుల్లో 48 పరుగులు, మహ్మదుల్లా 27 బంతుల్లో 25 పరుగులు చేయడంతో బంగ్లాదేశ్ 120 పరుగులు మార్కును దాటింది. నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్ 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. అఫ్గానిస్థాన్ బౌలర్లలో ముజీబుర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ చెరో 3 వికెట్లు తీశారు. 


Also Read : Inzamam-ul-Haq on Kohli: విరాట్‌ కోహ్లీపై ఇంజీ కామెంట్స్‌! పంత్‌ను తీసేయడంపై విమర్శ!